ప‌వ‌న్ 27వ చిత్రం.. డిఫ‌రెంట్ పాత్ర‌లో..

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే రాజ‌కీయాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే దిల్‌రాజు, బోనీక‌పూర్ కాంబినేష‌న్‌లో 'పింక్‌' రీమేక్ రూపొందుతోంది. జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి నుండి ప‌వ‌న్ యూనిట్‌తో జాయిన్ అవుతారు. ఈ రీమేక్‌ను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ మ‌రో సినిమా కూడా చేస్తాడ‌ని స‌మాచారం. డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తాడ‌ట‌. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాను ఎ.ఎం.ర‌త్నం నిర్మించ‌నున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మెఘ‌ల్ కాలానికి చెందిన క‌థ‌తో క్రిష్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని, ఈ చిత్రంలో ప‌వ‌న్ దొంగ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని టాక్‌. పీరియాడిక్ సినిమా కాబ‌ట్టి ద‌ర్శ‌క నిర్మాత‌లు భారీ సెట్స్‌ను వేయాల‌నుకుంటున్నార‌ట‌. దొంగ అనే అర్థం వ‌చ్చేలా మంచి టైటిల్‌ను పెట్టాల‌ని క్రిష్ భావిస్తున్నాడ‌ట‌. పింక్ రీమేక్‌ను ప‌వ‌న్ పూర్తి చేసే లోపు క్రిష్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నాడ‌ట‌. 2020 ద్వితీయార్థంలో సినిమాను షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ని టాక్‌.

More News

విజయ్ దేవరకొండ విలన్ గా యంగ్ హీరో

కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో నటించి ఆ తరువాత హీరోలుగా స్థిరపడ్డ వారు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

`స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3`లో ఐటెమ్ గ‌ర్ల్‌

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్యాన్స్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. అంటే కథలో భాగంగా పాటలు రావటం, వాటిల్లో స్టెప్పులు వేయటం కాదు.

హీరో సిద్ధార్థ్ 'టక్కర్' ఫస్ట్ లుక్ విడుదల

హీరో సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

బర్త్ డే వేడుకల్లో హీరో ఆది

హీరోల లైఫ్ లో ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ అయిపోతారు.. అందుకే తన బర్త్ డే వేడుకల్ని ఫాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు హీరో ఆది.

ఏఎస్‌రావు నగర్‌లోనూ 'వివాహ భోజనంబు' రుచులు

భాగ్యనగర వాసులకు తెలుగింటి వంట రుచి ఏంటో చూపిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను అందిస్తున్న 'వివాహ భోజనంబు' రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఆదివారం ఏఎస్‌రావు నగర్‌లో ప్రారంభమైంది.