Pawan Kalyan:పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Tuesday,March 26 2024]

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. తాను పోటీచేయబోయే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 30 నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని.. అందుకు అనుగుణంగానే తన పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించనున్నారు ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనుండగా.. తొలి మూడు రోజులు ఆ నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేస్తారు. అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. అదే రోజు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఉండనున్నాయి. తదుపరి శ్రీపాద వల్లభుని దర్శించుకోనున్నారు.

ఇక మార్చి 31న ఉప్పాడ సెంటర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 1న పార్టీలో చేరికలు, నియోజకవర్గంలోనే మేథావులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే టీడీపీ, బీజేపీ నేతలతోనూ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇతర నియోజకవర్గాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో సహా సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారని తెలిపారు. అలాగే ఉగాది వేడుకలు సైతం పిఠాపురంలోనే జరుపుకోనున్నారని వెల్లడించారు.

మొత్తానికి ఈసారి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉన్న పవన్.. అందుకు తగ్గట్లే కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే తన నియోజకవర్గంతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. వీటితో పాటు మూడు పార్టీలు నిర్వహించే బహిరంగసభల్లోనూ పాల్గొంటారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనతో పాటు తదితర కార్యక్రమాల్లోనూ హాజరుకానున్నారు.

More News

Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

IPL Schedule 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే తొలి విడతలో 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Chandrababu: అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు.

Gali Janardhan Reddy: బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి.. పార్టీ విలీనం..

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhana Reddy) తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.

Sugunamma: తిరుపతి సీటుపై పునరాలోచించాలి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి..

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా కొంతమంది నేతలకు టికెట్ దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు పొత్తులో టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.