ప‌వ‌న్ మొద‌లెట్టేద‌ప్పుడేన‌ట‌!!

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు ఇది రీమేక్. ఈ ఏడాది మే 15న వ‌కీల్‌సాబ్‌ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీక‌పూర్ భావించారు. అయితే కోవిడ్ 19 విజృంభించ‌డంతో దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్‌ల‌ను ఆపేశారు. అలా ‘వ‌కీల్‌సాబ్’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం షూటింగ్స్‌ను కొన్ని ప‌రిమితులు విధించి గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ‘వ‌కీల్‌సాబ్‌’ మాత్రం సెట్స్‌కు వెళ్ల‌డానికి ఒప్పుకోవ‌డం లేద‌ట‌. నిజానికి ఇటీవ‌ల ఈ చిత్రం ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంద‌ని అనుకున్నారు. కానీ ప‌వ‌న్ మాత్రం ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ‌కు ఓకే చెప్ప‌లేద‌ని సెప్టెంబ‌ర్‌లో స్టార్ట్ చేయాల‌నుకుంటున్నట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్‌లో షూటింగ్స్ స్టార్ట్ చేసి ఈ ఏడాదిలోనే షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. ‘వకీల్‌సాబ్‌’ షూటింగ్ పూర్తి చేయ‌గానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాల్సి ఉంది.

More News

ఇండిపెండెన్స్ డే  కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..

అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో

ఏపీ కరోనా బులిటెన్ విడుదల..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేడు ఏపీలో మొత్తంగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

కొద్ది రోజుల క్రితం వరకూ ఏపీ సీఎం జగన్‌ను పట్టుకున్న ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను పట్టుకుందా?