close
Choose your channels

అన్నయ్య టైటిల్‌తో....

Monday, October 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన్నయ్య టైటిల్‌తో....

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోశియునుమ్‌' సినిమాకు ఇది రీమేక్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ చెప్పకపోయినా.. అసలు విషయమైతే అదే. కాగా.. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుంటే.. మరో పాత్రలో రానా దగ్గుబాటి నటించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాకు 'బిల్లా రంగా' అనే టైటిల్‌ పరిశీలనలో ఉందట. బిల్లా పాత్రలో పవన్‌, రంగా పాత్రలో రానా నటించబోతున్నారు. ఒకప్పుడు ఇదే టైటిల్‌తో చిరంజీవి, మోహన్‌బాబు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మాస్ టైటిల్‌తో పవన్‌ సినిమా తెరకెక్కనుందన్నమాట. పొల్లాచ్చిల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ జరిగిపోయింది. సినిమాలో నటించబోయే ఇతర నటీనటులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. వచ్చేఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ అనుకుంటున్నట్లు టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.