మంత్రి మేకపాటిపై పవన్ ఫైర్..

  • IndiaGlitz, [Tuesday,January 12 2021]

దివీస్ లాబొరేటరీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడమని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అడుగుతున్నారంటే ఆయన చిత్తశుద్ధిపై సందేహం కలుగుతోందని సందేహాలు కలుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన చెబుతున్న మాటలు సమస్యను ఏమార్చేదిగా బోడిగుండుకి బొటన వేలుకి ముడిపెట్టినట్టు ఉందన్నారు.

తూర్పు గోదావరి జిల్లా తొండంగా మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటవుతున్న దివిస్ లాబొరేటరీస్ కర్మాగారం కారణంగా అక్కడి 15 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు సోకడం లేదా? అని ప్రశ్నించారు. ఆ కర్మాగారానికి అనుమతులిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని తప్పించుకోవడానికి యత్నంచడం ఎంత వరకూ సబబో మరోసారి ఆలోచించాలని మంత్రి గౌతంరెడ్డికి సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిస్తే మీరు ఆపరా? అని ప్రశ్నించారు. ఆయన ప్రారంభించిన అన్నింటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా అని పవన్ గుర్తు చేశారు.

రాజధాని అమరావతిని ఆపారని.. పోలవరం ప్రాజెక్టును రివర్స్‌లో తీసుకెళుతున్నారన్నారు. ‘మరి అదే విధంగా దివీస్ కర్మాగారంపై అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుని.. ఆ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకోవచ్చుగా... కనీసం అరెస్ట్ చేసిన 36 మందిని వదిలి పెట్టలేరా? అని పవన్ ప్రశ్నించారు. ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నీకింత.. నాకింత అని కిక్ బ్యాక్స్ తీసుకున్నారా? లేదా ప్రత్యర్థులను పథకం ప్రకారం హతమార్చారా? కేవలం ఫ్యాక్టరీ వద్దన్నందుకు అమాయకులను అరెస్టులు చేసి జైళ్లలో పెడతారా? వారి కుటుంబాల శోకం మీ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది’’ అని పవన్ పేర్కొన్నారు.

More News

స్టార్ హీరో సినిమాలో హారిక‌

దేత్త‌డి హారిక‌.. యూట్యూట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హారిక‌కు బిగ్‌బాస్ మంచి ఇమేజ్‌నే తెచ్చిపెట్టింది.

రామ్‌ నెక్ట్స్‌ మూవీ డైరెక్టర్‌ ఎవరో తెలుసా..?

ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌.. నెక్ట్స్‌ మూవీ ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

ద్వారకా తిరుమల ఆలయానికి రైస్ మిల్లర్స్ అసోషియేన్ భారీ విరాళం..

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శేషాద్రి కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

'దేవినేని' పాత్రలో తారకరత్న

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'దేవినేని'. దీనికి ''బెజవాడ సింహం'' అనేది ట్యాగ్ లైన్.

తుర్లపాటి మరణం నన్నెంతగానో బాధించింది: పవన్

ప్రముఖ జర్నలిస్ట్.. పద్మశ్రీ పురస్కార గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(89) కన్నుమూశారు.