టార్గెట్ ఫిక్స్ చేసిన ప‌వ‌న్‌!!

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే ‘వ‌కీల్‌సాబ్‌’తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు ప‌వ‌న్ మ‌రో మూడు సినిమాల‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. అందులో హ‌రీశ్ శంక‌ర్ సినిమాతో పాటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్ కూడా ఉంది. ఇవి కాకుండా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ రీమేక్ కోసం నిర్మాత‌ల‌కు టార్గెట్ పెట్టార‌ని స‌మాచారం. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేస్తేనే తాను సినిమాలో నటిస్తానని పవన్ చెప్పారట. అందుకు నిర్మాతలు ఓకే అన్నారు. సింపుల్ స్టోరీ. పవన్‌తో న‌టించ‌బోయే మ‌రో హీరోను వెతుక్కోవాలంతే. విజ‌య్ సేతుప‌తి, రానా స‌హా కొంత‌ మంది పేర్లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ తదుప‌రి సినిమాపై ఓ క్లారిటీ రానున్న‌ట్లు టాక్‌.

More News

కార్తీక్ రాజు దర్శకత్వంలో ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘ది ఛేజ్’

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’, లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’

మామయ్యను చంపేశారు.. మా మేనత్త పరిస్థితి విషమంగా ఉంది: రైనా

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సడెన్‌గా ఐపీఎల్ నుంచి వెనక్కి వెళ్లిపోవడం దానికి గల కారణాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

నాని సినిమా కోసం స్పెష‌ల్ సెట్‌..?

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో

‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ ప్లాన్ అదేనా..?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్.

పెద్ద హీరోలతో చేయాలంటే భయం: మోహనకృష్ణ ఇంద్రగంటి

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.