పెద్దిరెడ్డి అక్రమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్


Send us your feedback to audioarticles@vaarta.com


వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమణ వ్యవహారంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అలాగే ఈ భూములను రక్షించలేని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు.
భూముల ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ ఇచ్చిన నివేదికను పవన్ కల్యాణ్ పరిశీలించారు. డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ విచారణ జరిపి పవన్ కల్యాణ్ కు నివేదిక ఇచ్చారు. పెద్దిరెడ్డి భూముల వ్యహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ నివేదికను పవన్ పరిశీలించారు. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.
భూములు ఆక్రమించిన వారిపైనా క్రిమినల్ కేసులతో పాటు, అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చెయ్యాలన్నారు పవన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ.. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నివేదిక అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com