close
Choose your channels

బండ్లగణేశ్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Monday, September 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బండ్లగణేశ్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

పవర్‌స్టార్‌ వపన్‌కల్యాణ్‌, నిర్మాత బండ్లగణేశ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రూపొందనుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్లగణేశ్‌ అధికారికంగా ప్రకటించారు. తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా బండ్లగణేశ్‌ తన తదుపరి సినిమా విషయాన్ని ప్రకటించారు. "నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు" అని మెసేజ్‌తో పాటు పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు బండ్లగణేశ్‌. వీరిద్దరి కాంబినేషన్‌ అనగానే మనకు తీన్‌మార్‌, గబ్బర్‌సింగ్‌ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఇందులో తీన్‌మార్‌ ప్లాప్‌ అయ్యింది. గబ్బర్‌సింగ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మూడో సినిమా రూపొందనుంది. మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

పవన్‌కల్యాన్‌ రీ ఎంట్రీ తర్వాత ఇప్పటికే ఐదు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఇప్పుడు ఆరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరి ఈ సినిమాల్లో పవన్‌ ఎప్పుడు నటిస్తారు? అనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. వకీల్‌సాబ్‌ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత పవన్‌ తదుపరి క్రిష్‌ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. దీని తర్వాత హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్‌ రెడ్డి, దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.