close
Choose your channels

పవన్-హరీశ్ శంకర్ మూవీ.. ఆసక్తికరమైన అప్‌డేట్స్..

Sunday, April 4, 2021 • తెలుగు Comments

పవన్-హరీశ్ శంకర్ మూవీ.. ఆసక్తికరమైన అప్‌డేట్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అదరగొట్టేస్తున్నారు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టి షాకిస్తున్నారు. మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఫుల్ పవర్ అండ్ ఎనర్జీతో సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’గా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో యంగ్ హీరోయిన్స్ నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇక పవన్ ఏక కాలంలో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే పవర్‌ఫుల్ సినిమాలో చేస్తూనే మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్‌లో సైతం నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ వీలైనంత త్వరగా పూర్తి చేసి హరీష్ శంకర్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్-హరీశ్ శంకర్ కాంబోలో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అది ‘గబ్బర్ సింగ్’ సినిమాతోనే ప్రూవ్ అయిపోయింది. దీంతో మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా కోసం మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ సోషల్ మీడియాలో కనిపించినప్పుడల్లా ఆయనకు ఎదురయ్యే తొలి ప్రశ్న ఇదే. అభిమానుల ఎదురు చూపులు ఇన్నాళ్లకు ఫలించాయి. పవర్ స్టార్ - హరీష్ శంకర్ కాంబోలో మైత్రీ మూవీ నిర్మాణంలో భారీ బడ్జెట్‌ సినిమా రూపొందబోతోంది. అయితే ఈ మధ్య ఈ కాంబినేషన్‌లో సినిమా కథ మీద కొన్ని ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. పవన్ కోసం హరీశ్ శంకర్ ఓ మాస్ కథ సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి తాజా ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఏంటంటే.. ఈ చిత్రంలో పవన్.. తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. ఇందులో ఒక రోల్ ఐబీ ఆఫీసర్ అని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమన్నది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు.

Get Breaking News Alerts From IndiaGlitz