close
Choose your channels

పవన్ హీరోయిన్ ఖ‌రారు.. ఈసారి హిట్ కొడతాడా?

Thursday, February 6, 2020 • తెలుగు Comments

పవన్ హీరోయిన్ ఖ‌రారు.. ఈసారి హిట్ కొడతాడా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అంతే కాకుండా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌రో రెండు సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ `పింక్‌` సినిమా రీమేక్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఈ రెండింటితో పాటు హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు హ‌రీశ్ శంక‌ర్‌.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌. ఇది వ‌ర‌కు ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్, శృతిహాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్..ఇండ‌స్ట్రీ హిట్‌ను సాధించింది. మ‌రి రెండోసారి ఈ కాంబోలో హిట్ ద‌క్కుతుందేమో తెలియాలంటే మ‌రి కొన్ని నెల‌లు ఆగ‌క త‌ప్ప‌దు. ల‌వ్ ఎఫైర్ బ్రేకప్ అయిన త‌ర్వాత శృతిహాస‌న్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ర‌వితేజ `క్రాక్‌` సినిమాలో న‌టిస్తుంది. మ‌ళ్లీ ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటే సెంటిమెంట్ వ‌ర్కవుట్ అవుతుంద‌నీ కావ‌చ్చు.. సినిమాపై అం చ‌నాలు కూడా పెరిగే అవ‌కాశాలు ఉండ‌టంతో హ‌రీశ్ శంక‌ర్ శృతినే సంప్ర‌దించాడ‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz