ఇల్లు కొనే యోచనలో పవన్ హీరోయిన్

  • IndiaGlitz, [Monday,July 10 2017]

అను ఇమ్మాన్యుయల్‌ మూలాలు కేరళ. అయితే పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. తండ్రి మలయాళ నిర్మాత కావడంతో చిన్న వయసులో 'స్వప్న సంచారి' అనే సినిమాలో బాలనటిగా చేసింది. తర్వాత 'యాక్షన్‌ హీరో బిజ్జు'లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మాత్రం నాని 'మజ్ను' చిత్రంతో పరిచయమైంది. తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ముందు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే భయపడిందట. అందుకు కారణం తనకు భాష రాకపోవడమే.
మలయాళంలో నటించడం ఇబ్బందిగా అనిపించలేదు. కానీ తెలుగులో మొదటి సినిమా చేయాలనుకున్నప్పుడు మాత్రం కాస్తా భయపడిన మాట వాస్తవమే. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు నాకు హైదరాబాదే నా సొంత ఊరు అనే అభిప్రాయం కలుగుతుంది. కేరళలో కన్నా ఇక్కడ ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను. త్వరలోనే ఇక్కడ ఒక ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ ఇల్లు ఉంటే అమ్మను తీసుకురావచ్చు అంటూ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని తెలియచేసింది.

More News

శ్రద్దాదాస్ చెడు అలవాటు

ఎంత పెద్ద వారైనా చిన్న వయసులో జరిగిన కొన్ని విషయాలు, ఘటనలు, చేసిన అల్లరి పనులు, అలవాట్లు తలుచుకుని నవ్వుకుంటూ ఉంటారు. అందుకు సినీ తారలు కూడా అతీతులేం కారని అంటూ శ్రద్ధాదాస్.

లావణ్య విత్ లవ్ బాయ్స్ గీతావిష్కరణ

రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

పాతికేళ్ల తర్వాత...

దాదాపు పాతికేళ్ళ తర్వాత సంజయ్దత్, శ్రీదేవి మరోసారి జత కట్టనున్నారు. 1993లో వచ్చిన 'గుమ్రా' అనే చిత్రంలో సంజయ్దత్, శ్రీదేవి కలిసి నటించారు.

'ఏజంట్ భైరవ' ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు: బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్,కీర్తి సురేష్,జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'.

సీక్వెల ప్లాన్ లో శంకర్...

'జెంటిల్మేన్','భారతీయుడు'నుండి విడుదల కాబోతున్న '2.0' వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్.