అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన పవన్

  • IndiaGlitz, [Friday,January 22 2021]

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని అందజేశారు. శుక్రవారం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర చీఫ్ భరత్‌ని కలిసిన పవన్.. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం రూ. 30 లక్షల విరాళం అందచేశారు. అలాగే తన వ్యక్తిగత సిబ్బంది సమకూర్చిన రూ. 11,000 చెక్కును సైతం భరత్‌కు పవన్ కల్యాణ్ అందచేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. ఆయన చూపిన సహనం, త్యాగం, శౌర్యం అందరికీ స్ఫూర్తి. భారతదేశం ఇన్ని దాడులకు బలంగా నిలబడింది అంటే అది శ్రీరామచంద్రుడు వేసిన దారే.. అలాంటి ధర్మానికి ప్రతిరూపం అయిన అయోధ్యలో ఆలయం కడుతుంటే మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. నా వంతుగా 30 లక్షల రూపాయలు రామాలయ నిర్మాణానికి ఇస్తున్నాను. నేను ఇలా విరాళం ఇస్తున్నాను అని తెలియగానే నా వ్యక్తిగత సిబ్బంది కూడా తమ వంతుగా రూ. 11000 సమకూర్చారు. ఈ సిబ్బందిలో హిందువులే కాదు ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

More News

ఫిబ్రవరి 19న 'చెక్' రిలీజ్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న  'చెక్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది.

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

దుబాయ్‌లో సర్కారువారి పాట లాంగ్ షెడ్యూల్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమా స‌ర్కారు వారిపాట‌ కోసం దుబాయ్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

నాగ‌శౌర్య‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన 'లక్ష్య' టీజ‌ర్‌

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో

పిటిషన్ మొత్తం తప్పుల తడక.. వైసీపీకి సుప్రీంలో ఊహించని షాక్

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.