close
Choose your channels

పవన్.. ఒకరు కాదు ఇద్దరు

Thursday, January 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్స్‌.. ఇలా ప్ర‌తి అంశంతోనూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న అజ్ఞాత‌వాసి భారీ అంచనాలు పెంచేసింది. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది. ఇంత‌కీ అదేమిటంటే.. అజ్ఞాత‌వాసిలో ప‌వ‌న్ చేస్తున్న పాత్ర ఒక‌టి కాద‌ట‌. ఏకంగా రెండు పాత్ర‌లు చేస్తున్నార‌ట ప‌వ‌న్‌. అదే ఈ సినిమాలోని అస‌లైన ట్విస్ట్ అని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

గ‌తంలోనూ.. తీన్ మార్ చిత్రంలో ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యం చేశారు. అయితే.. అవి రెండూ వేర్వేరు కాలాల‌కి చెందిన పాత్ర‌లు. అయితే ఈ సినిమాలో మాత్రం ఒకే కాలానికి చెందిన పాత్ర‌లని తెలిసింది. ఈ రెండు పాత్ర‌ల్లోనూ ప‌వ‌న్ న‌ట‌న డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలిసింది. తీన్ మార్, అజ్ఞాత‌వాసికి ఉన్న మ‌రో కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ వార‌ణాసి నేప‌థ్యం ఉండ‌డం. మ‌రి తీన్ మార్‌కి వ‌ర్క‌వుట్ కాని డ్యూయెల్ రోల్‌, వార‌ణాసి నేప‌థ్యం అజ్ఞాత‌వాసికి అయినా వ‌ర్క‌వుట్ అవుతాయేమో చూడాలి. ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.