‘దిశ చట్టం కాదు జగన్.. ముందు ఆ రెండు కేసులు తేల్చు..!’

  • IndiaGlitz, [Sunday,December 15 2019]

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’ అనంతరం ఆ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో యావత్ ప్రపంచం.. తెలంగాణ పోలీసులను, ముఖ్యంగా సీఎం కేసీఆర్, సీపీ సజ్జనార్ పేరు మార్మోగింది. అయితే అత్యంత పాశవికంగా దేశ రాజధానిలో ‘నిర్భయ ఘటన’ తర్వాత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరగడంతో ఇలాంటి ఘటనలు ఏపీలో జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలతో కూడిన ‘ఏపీ దిశ చట్టం’ ను సీఎం వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పటికే శాసనసభ, మండలి, కేబినెట్‌లోనూ ఆమోదం పొందింది. దిశ చట్టం తీసుకురావడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకున్న నేతలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు సైతం స్పందించి, సమర్థించి.. ‘శభాష్.. జగన్’ అన్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చట్టంపై స్పందించి.. మద్దతిచ్చి.. జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇంతవరకూ ఈ చట్టంపై స్పందించని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా స్పందించారు.

ఆ రెండు కేసుల సంగతేంటి!?

ఆడవారి భద్రత కోసం చేపట్టే ఏ చర్య అయినా మంచిదేనని.. అయితే ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేయకుండా కొత్త చట్టాలంటే ఉపయోగం ఏముంటుంది!? అని జగన్ సర్కార్‌పై ఒకింత పవన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మహిళలపై హింసకు పాల్పడినవారిని 21 పనిదినాల్లో శిక్షించేలా కొత్త చట్టం తేవడం మంచిదేనన్నారు. కానీ అంతకంటే ముందుగా.. ‘బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు.. జగన్‌పై కత్తితో దాడి కేసులు రెండింటింలో దోషులెవరో తేల్చాలి. ఆ దోషులను కూడా ఇలాగే.. ఇలాగే 21 పని దినాల్లో పరిష్కారం చేసి, శిక్షించవచ్చు కదా!’ అని ఒకింత వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు ఈ రెండు కేసుల్లో ప్రభుత్వం దోషులను తేల్చి కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు.

ఇలా చేయండి..!

తప్పు చేసినవాణ్ణి చంపేయచ్చు, నరికేయవచ్చు’ అని అందరూ అంటున్నారని అయితే.. అలా ఆటవిక న్యాయం బదులు సింగపూర్‌లో, దుబాయ్‌లో లాగా అలాంటి కఠినమైన దండనల్ని చట్టబద్ధం చేయండి అనేది తన వాదన అని పవన్ చెప్పుకొచ్చాడు. తప్పు చేయాలంటే, భయపడే విధంగా బహిరంగంగానే శిక్షించే చట్టం తీసుకురావాలని జగన్ సర్కార్‌కు ఈ సందర్భంగా పవన్ సూచించారు. మహిళల భద్రత కోసం ఉన్న చట్టాలను కట్టుదిట్టం చేయాలని.. అలాగే బలంగా అమలు చేయాలని పవన్ తెలిపారు.

ఇదీ అసలు పరిస్థితి!

కాగా.. వివేకా హత్య కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు వేగవంతం చేసి పలువురికి నోటీసులిచ్చి విచారణ జరుపుతోంది. మరోవైపు.. కోడి కత్తి కేసులో జైలు శిక్ష అనుభవించిన శ్రీనివాస్ బయటికి వచ్చాడు. అయితే పవన్ తాజా వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘మీరేంటి దిశ చట్టం గురించి మాట్లాడేది.. మీ అన్నే రియాక్టయ్యి శభాష్ అన్నాడు.. మీరేం మాకు సుప్రీం కాదు కదా’ అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విమర్శలపై అప్పుడప్పుడు సభల్లో ఊహించని రీతిలో కౌంటర్లిచ్చే సీఎం జగన్ ఎలా.. పవన్ తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

సినిమాల్లోకి రీ ఎంట్రీపై తేల్చేసిన పవన్ కల్యాణ్..

టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు. అయితే సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో మాత్రం ఆయన రాణించకలేకపోయారు.

ఒక వేళ పవన్ సినిమాల్లోకి రాకపోయుంటే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని.. పవర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు..

నాగబాబులోని రెండో కోణాన్ని బయటపెట్టిన పవన్!

మెగాస్టార్ నాగబాబు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోతో పాటు పలు పత్రాల్లో నటించి మెప్పించిన ఈయన.. ఇప్పుడు మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. అంతేకాదు..

'రూల‌ర్‌' అభిమానులు, ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న

గొల్లపూడి గురించి మాట్లాడుతూ చిరు కంటతడి!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.