close
Choose your channels

ప్రధాని మాట పాటిద్దాం.. నేనూ ఫేస్‌బుక్ లైవ్‌కు వస్తా!

Friday, March 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రధాని మాట పాటిద్దాం.. నేనూ ఫేస్‌బుక్ లైవ్‌కు వస్తా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని.. మోదీ చేసిన సూచనలను జనసైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 వ తేదీ ఆదివారాన్ని మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూగా పాటిద్దామన్నారు. ‘ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదాం. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికిగాను ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రతీ ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి గారు చెప్పినట్లు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం’ అని జనసేనాని పిలుపునిచ్చారు.

నేను అక్కడే ఉన్నా..!

‘ఈ సందర్భంగా అమెరికాలో చూసిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2001 సెప్టెంబర్ 11 న ట్విన్ టవర్స్‌ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఇది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేనూ పాలుపంచుకున్నాను. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తాను. మోదీ పిలుపునకు దేశమంతా స్పదించాలని కోరుకుంటున్నాను. నేను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. ఫేస్ బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు వస్తాను. కరోనాపై పోరాటంలో మన ధృడ చిత్తాన్ని చాటుకుందాము’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.