అగ్ని వీరుడికి అశ్రునివాళి


Send us your feedback to audioarticles@vaarta.com


ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా, గోరంట్ల మండల, కళ్లితండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లిన మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్య ప్రసాద్, పలువురు శాసన సభ్యులతో కలసి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు.
మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతి బాయ్, శ్రీరాం నాయక్ ని పవన్ పరామర్శించారు. పుత్ర శోకంలో ఉన్న ఇరువురినీ ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం, ఐదు ఎకరాల పొలం, 300 గజాల స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
వ్యక్తిగతంగా మురళీనాయక్ కుటుంబానికి మరో రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు పవన్ కల్యాణ్. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments