'పింక్' కి పవన్ కళ్యాణ్ యాత్ర దెబ్బ?

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా 'పింక్‌'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్‌రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని మీడియా వ‌ర్గాలు పేర్కొన్నాయి. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వార్త‌ల‌ను ప‌వ‌న్ పి.ఆర్ టీం నుండి అధికారిక ఎక్క‌డా అనౌన్స్ చేయ‌లేదు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయన్నారు కొంద‌రు.కాగా ఇప్పుడు ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ మ‌రోసారి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ యాత్ర చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఒక‌వేళ ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల వైపు మొగ్గితే సినిమా డిసెంబ‌ర్‌లోనే స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు.

'పింక్' సినిమా ఓ కోర్టు డ్రామా. సినిమా ఎక్కువ భాగం కోర్టులోనే న‌డుస్తుంది. కాబ‌ట్టి ఈ కీల‌కమైన స‌న్నివేశాల కోసం నిర్మాత‌ల దిల్‌రాజు అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ఓ ఫ్లోర్‌ను అద్దెకు తీసుకున్నార‌ట‌. అందులో ఓ కోర్టు సెట్ వేయించ‌బోతున్నార‌ట‌. అలాగే ఈసినిమా స్క్రీన్‌ప్లే 'పింక్' త‌మిళ రీమేక్ 'నేర్కొండ పార్వ్యై' త‌ర‌హాలో ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

సగానికి తగ్గించుకున్న బోయపాటి రెమ్యూనరేషన్

మాస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుని అగ్ర హీరోల‌తో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.

మహేష్ మూవీకి స్పెష‌ల్ సాంగ్స్‌ను సిద్ధం చేసిన దేవిశ్రీ

సాధార‌ణంగా ఇప్ప‌టి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అనైనా అనండి.. స్పెష‌ల్ సాంగ్స్ అనైనా అనండి.. ఓ సాంగ్ కామ‌న్‌గా ఉంటూ వ‌స్తుంది.

అయోధ్య తీర్పుపై జనసేనాని స్పందన ఇదీ...

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.

అయోధ్యపై తీర్పు:  ‘జై శ్రీరామ్’.. మీ కొచ్చిన సమస్య ఏంటి?: రష్మి

దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య భూ వివాదంపై నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

టీచర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి

సినిమా రంగంలో సెంటిమెంట్‌ను ఫాలో కానీ వారుండ‌రు. టాప్ స్టార్స్ నుండి చిన్న‌వారు వ‌ర‌కు అంద‌రికీ ఏదో ఓక సెంటిమెంట్ ఉంటుంది.