పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!

  • IndiaGlitz, [Friday,July 03 2020]

అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ సకాలంలో వెయ్యికి పైగా 104, 108 వాహనాలను తెప్పించి.. వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా ఆయన ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. దీనిని ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సుల్ని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం.. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం’’ అని ట్వీట్ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూనే తెలంగాణకు చురకంటించారని నెటిజన్లు పేర్కొంటున్నారు. గత మూడు నెలలుగా.. అలసత్వం అనే మాటలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించే అన్నారని నెటిజన్లు భావిస్తున్నారు.

More News

ఎన్టీఆర్‌తో ఢీ కొట్ట‌డానికి మంచు హీరో ఒప్పుకుంటాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెల‌లు త‌ర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.

నా మొద‌టి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది - అల్లు అర్జున్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'మాస్టర్ జీస‌, 'మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ' అని అంతా ప్రేమగా పిలిచే  ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే.

మోదీ లద్దాఖ్ పర్యటనపై పరోక్షంగా స్పందించిన చైనా..

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే.

‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌ పేరుతో దారుణం.. కేసు నమోదు

సోషల్ మీడియా మోసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అమ్మాయిల నంబర్లను సేకరించి సెలబ్రిటీల పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

మోదీ రాకతో ఉద్విఘ్నం.. నినాదాలతో హోరెత్తించిన జవానులు

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ రాకతో అక్కడ కొంతసేపు ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది.