కోడెల మరణంపై జనసేనాని రియాక్షన్ ఇదీ...

  • IndiaGlitz, [Monday,September 16 2019]

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు ఎదురుకోలేక ఆయన తుదిశ్వాస విడవటం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. కోడెలపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు.

శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా!

‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నాను. ఈ ఆపత్కాల సమయంలో కోడెల కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతున్నాను. రాజకీయవేత్తగా అంచెలంచలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నో పదవుల్ని అలంకరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా తరపున, పార్టీ తరపున కోడెల మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాను’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

More News

కోడెల మృతికి ‘ఆయనే’ కారణమా..? ఆత్మహత్య కాదా..!?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి కొడుకే కారణమా..? ఆయన ఆత్మహత్య చేసుకోలేదా..?

కోడెల ఆత్మహత్యకు ముందు సన్నిహితులతో షాకింగ్ విషయాలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ కీలక నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన..

'వాల్మీకి' తో వరుణ్‌తేజ్ కి మరో సూపర్‌ హిట్‌ ఇస్తారు - వెంకటేష్

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో

సెలబ్రిటీస్ బెడ్ స్టోరీస్ తో వస్తున్నా - మంచు లక్ష్మి

సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టివిల్లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు.

బిగ్‌బాస్ నుండి శిల్పా ఎలిమినేట్‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ స్టార్‌మాలో ప్ర‌సారం అవుతుంది. ఈ సీజ‌న్‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది.