భారతదేశ ముద్దుబిడ్డ లాల్ బహుదూర్ శాస్త్రి: పవన్
భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను గుర్తు చేసుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నుంచి 5 పాఠాలు నేర్చుకోవచ్చని పవన్ వెల్లడించారు. ‘‘భారతదేశపు ముద్దు బిడ్డ, ఫ్రీడమ్ ఫైటర్, స్టేట్స్ మాన్, ప్రధానిగా పని చేసిన లాల్ బహదూర్ శాస్త్రిగారి వర్ధంతి సందర్భంగా.. నివాళి అర్పిస్తున్నాను.
లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం నుండి 5 పాఠాలు:
1. ఆయన మొదటి ప్రాధాన్యం జాతి.. రాజకీయాలు అనేవి జాతికి చేసే సేవ.
2. గ్రీన్ అండ్ వైట్ విప్లవాలను ప్రమోట్ చేయడం ద్వారా ఆయన భారతదేశంలో స్వయం రిలయన్స్‌ను ప్రోత్సహించారు.- ఈ విధంగా చేయడం వలన భారతదేశంలో భవిష్యత్తు ఆహార భద్రతకు సహాయపడటమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే పాలను ఉత్పత్తి చేసే దేశాల్లో అగ్రగామిగా నిలిపింది.
3. నిరుపేదగా మరణించిన అరుదైన ప్రధానమంత్రి.. దీని ద్వారా తన నిస్వార్థ వైఖరి, ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత తెలియజేస్తున్నాయి. 1965 యుద్ధ సమయంలో జీతం తీసుకోకుండా పని చేసిన గొప్ప వ్యక్తి.
4. 1965 యుద్ధ సమయంలో ఆహార కొరత నెలకొన్న పరిస్థితుల్లో.. రైతులు, సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి ఆయన జై జవాన్ - జై కిసాన్ నినాదాన్ని రూపొందించారు.
5. ఆయన ఇంటెగ్రిటి, సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచారు’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.