close
Choose your channels

షాకింగ్ రోల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌?

Monday, March 16, 2020 • తెలుగు Comments

షాకింగ్ రోల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. బాలీవుడ్ చిత్రం పింక్‌ను వ‌కీల్‌సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ పార్ట్ 80 శాతం పైగానే పూర్త‌య్యింద‌ట‌. ఇది సెట్స్‌పై ఉండ‌గానే క్రిష్ సినిమాను ప‌వ‌న్ స్టార్ట్ చేసేశాడ‌ని అంటున్నారు. క్రిష్ సినిమా తుది ద‌శ‌కు చేరుకోగానే హ‌రీశ్ శంక‌ర్ సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ని టాక్‌. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన హ‌రీశ్ శంక‌ర్‌.. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు కూడా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌నే తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాడ‌ట హ‌రీశ్ శంక‌ర్‌. అయితే ఈసారి కాస్త సోష‌ల్ మెసేజ్‌ను కూడా జ‌త చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను హ‌రీశ్ ముఖ్య‌మంత్రిగా చూపించాల‌ని అనుకుంటున్నాడ‌ట హ‌రీశ్‌. మ‌రి ప‌వ‌న్ పాత్ర‌ను ఈ ద‌ర్శ‌కుడు ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా మ‌లుస్తాడో చూడాలి. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని టాక్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz