ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Tuesday,January 12 2021]

ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష దైవంగా కొలుస్తామని.. ఆ భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజుల పాటు పండుగ జరుపుకుంటామని పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘శ్వేత పద్మధరుడు సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము. ఆ భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజుల పాటు పండుగ జరుపుకుంటాం.

పుష్కలంగా పండే పంటలు భారతీయులకు సిరులను అందించే కాలం కావడంతో సంక్రాంతి సంబరాలు ఎంతో ఆడంబరంగా సాగుతాయి. అయితే ఈ సంక్రాంతి పంటలతో పాటు కరోనా మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ కూడా తీసుకురావడం ఎంతో ఆనందదాయకం. సంక్రాంతి తరువాత భారతదేశంలో వ్యాక్సిన్ ప్రారంభం కావడం శుభ పరిణామం. వ్యాక్సిన్ రూపకర్తలకు, ప్రోత్సహించిన ప్రభుత్వాలకు, మార్గదర్శకులైన అధికారులకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ముఖ్యంగా తెలుగువారి ఆచార, అభిరుచులను తెలియజేసే ఈ సంక్రాంతి పండుగ దేశ ప్రజలు, తెలుగువారికి సిరి సంపదలతో కూడిన ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మదమాత్సర్యాలు, మత మౌఢ్యాలు భోగి మంటలలో దహనం కావాలని ఆశిస్తున్నాను. హైందవులు పరమ పుణ్య దినాలుగా భావించే ఈ ఉత్తరాయణ కాలం నుంచి పాలకులు ఆదర్శవంతమైన పాలన అందించాలని, జవాబుదారీతనాన్ని అవలంభించాలని ఆశిద్దాం. అనుకూలమైన ప్రకృతితో దేశం సుభిక్షంగా శోభిల్లాలని కోరుకుంటూ నా తరుఫున, జనసేన శ్రేణుల తరుఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’’ అని పవన్ తెలిపారు.

More News

మేము చదవం.. వినం..: స్పష్టం చేసిన వాట్సాప్

ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ తన వినియోగదారులకు వివరణల మీద వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం స్టే...

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్..

కరోనా వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.

'అల‌వైకుంఠ‌పురంలో' వ‌న్ ఇయ‌ర్ రీయూనియ‌న్ ఈవెంట్

అల వైకుంఠపురంలో చిత్రం 2020, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది.

ఆనంద సాయి మాతృమూర్తి మరణ వార్త బాధించింది: పవన్

ప్రముఖ సినీ కళా దర్శకుడు, యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆనంద సాయికి మాతృ వియోగం కలిగింది.