పవన్ కళ్యాణ్ కిది ఆరోసారి

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

నాలుగేళ్ల క్రితం 'గ‌బ్బ‌ర్‌సింగ్‌'గా వేస‌వికి సంద‌డి చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ ఈ వేస‌వికి 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్' గా వినోదాన్ని పంచ‌డానికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌నే క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు.. సినిమాని ద‌గ్గ‌రుండి మ‌రీ అందంగా తీర్చిదిద్దుతున్నారు ప‌వ‌న్‌. ఇదిలా ఉంటే.. 'స‌ర్దార్' ఏప్రిల్ 8న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇలా ఏప్రిల్ నెల‌లో ప‌వ‌న్ సినిమా రావ‌డం ఇది ఆరోసారి.

2000లో బద్రి, 2001లో ఖుషి, 2003లో జానీ.. అంటూ త‌న వ‌రుస 3 చిత్రాల‌ను ఏప్రిల్‌లోనే అభిమానుల ముందుకు తీసుకువ‌చ్చిన ప‌వ‌న్‌.. ఆ త‌రువాత 2008లో జ‌ల్సా, 2011లో తీన్ మార్ చిత్రాల‌ను కూడా ఏప్రిల్‌లోనే వినోదాన్ని పంచేందుకు టార్గెట్‌గా చేసుకున్నారు. మ‌ళ్లీ 5 ఏళ్ల త‌రువాత అదే ఏప్రిల్‌లో ఇప్పుడు 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌'గా అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన 5 సినిమాల్లో మూడు విజ‌యాలు సాధించిన వైనం చూస్తే.. స‌ర్దార్ కి ఏప్రిల్ సెంటిమెంట్ బ‌లంగా ఉంద‌నే చెప్పాలి. ప‌వ‌న్‌కి క‌థానాయ‌కుడుగా 21వ చిత్రంగా.. న‌టుడుగా 23వ చిత్రంగా వ‌స్తున్న 'స‌ర్దార్' పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

More News

నితిన్, సమంత ల 'అ ఆ' ప్రచార చిత్రాలు విడుదల

నితిన్, సమంత ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం  అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు.  ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు  సందర్భంగా ఈరోజు విడుదలచేశారు.

విజయ్ 'తెరి' తెలుగు టైటిల్

తమిళ చలన చిత్ర పరిశ్రమ లో నే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ విజయ్ నటించిన తమిళ చిత్రం ‘తెరి’ని తెలుగులో పోలీసోడు పేరుతో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కలైపులి థాను విడుదల చేస్తున్నారు.

నిస్సహాయుల జీవితంలో ఆశాజ్యోతి లక్ష్మితో మేము సైతం

మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి,వారి కలల్ని నిజం చేయడానికి వస్తున్న ఆశాజ్యోతి మేము సైతం.

హిందీలో త్రిష సినిమాకు క్రేజ్....

గతేడాది నుండి టాలీవుడ్,కోలీవుడ్ లో హర్రర్ చిత్రాల హవా ఎక్కువైంది.ఈ హవాలో స్టార్ హీరోయిన్స్ సైతం హర్రర్ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపించారు.

'సర్దార్ ' తో దేవిశ్రీ సమస్య తీరేనా?

తోటి తెలుగు సంగీత దర్శకుల్లో మరెవరికి దక్కని అవకాశం యువ సంచలనం దేవిశ్రీ ప్రసాద్ కి దక్కుతోంది.