జనసేన భజన సేన కాదు...తెలుగు రాష్ట్రాల ప్రజలకు భజన సేన - పవన్

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి తుడా ఇంద‌రా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భలో మాట్లాడుతూ...నాకు సినిమాలంటే వ్యామోయం లేదు. వ‌ర్త‌మాన‌ రాజ‌కీయాలు యువ‌త‌కు మేలు చేయ‌క‌పోతే బాధ‌గా ఉంటుంది. సినిమాలో చాలా అద్భుతాలు చెప్ప‌వ‌చ్చు. ఆస్తులు దానం చేయ‌చ్చు. రౌడీల‌ను విల‌న్ ను కొట్టేయ‌చ్చు. హీరోయిన్స్ తో పాట‌లు పాడ‌చ్చు ఇదంతా రెండున్న‌ర గంట్లో చేసేయ‌చ్చు. అయితే....అస‌లైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు దొర‌కాలంటే...క‌ష్ట‌ప‌డాలి.. త్యాగాలు చేయాలి. ఈ రోజు మూడు విష‌యాలు గురించి మాట్లాడ‌తాను.
జ‌న‌సేన పార్టీ ఆవిష్క‌ర‌ణ త‌ర్వాత నేను ఎదుర్కొన్న విష‌యాలు గురించి... తెలుగుదేశం ప‌నితీరు గురించి....అడ్డ‌గోలుగా విడ‌గొట్టి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని కేంద్ర ప్ర‌భుత్వ గురించి మాట్లాడ‌తాను. స‌భ‌ను తిరుప‌తిలోనే పెట్టి ఎందుకు మాట్టాడాలి అంటే...మోడీ, చంద్ర‌బాబుల‌తో క‌లిసి ఫ‌స్ట్ మీటింగ్ పెట్టింది తిరుప‌తిలోనే. అందుకే ఇక్క‌డ మాట్టాడాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నాకు అంద‌రి స‌హాయ‌ స‌కారాలు కావాలి. ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌లు గురించి పోరాటం చేస్తాను. రాష్ట్రం విడిపోయి స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి స‌పోర్ట్ చేసాను..! ఇప్పుడు ఇరాటం పెట్టే విమ‌ర్శ‌లు చేయ‌ను. అయితే... ప్ర‌తి ఒక్క‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోడీ భ‌జ‌న చేయ‌డానికి జ‌న‌సేన పెట్టాడు అన్నారు. తెలుగుదేశం తొత్తు అని తిట్టారు. గ‌బ్బ‌ర్ సింగ్ కాదు ర‌బ్బ‌ర్ సింగ్ అన్నారు. తిట్టండి కానీ నేను ప్ర‌జ‌ల‌కు చేయాల్సింది. యువ‌త‌కు చేయాల్సింది చాలా ఉంది. నేను ఎక్క‌డికి పారిపోను. నా రాష్ట్రం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. మాట త‌ప్పే మ‌నిషిని కాదు మ‌డంతిప్పే మ‌నిషిని కాదు. జ‌న‌సేన భ‌జ‌న సేన భ‌జ‌న‌సేన అంటున్నారుకరెక్టే. తెలుగు రాష్ట్ర‌ల ప్ర‌జ‌ల‌కు భ‌జ‌న సేన‌. మాన‌వ‌త్వం కోసం పోరాటం చేసే వాళ్లు నిజ‌మైన హీరోలు అన్నారు.

More News

'కాష్మోరా' డబ్బింగ్ పూర్తి చేసిన కార్తీ

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,

ర‌జనీకాంత్ కుమార్తెకు అరుదైన గౌర‌వం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్  కుమార్తె ఐశ్వ‌ర ధ‌నుష్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఐక‌రాజ్య‌స‌మితి ఉమెన్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. సింగ‌ర్‌, ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేసిన ఐశ్వ‌ర్యకు ఇప్పుడు ఇలాంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల త‌మిళ మీడియా, ప్ర‌జ‌లు, స‌న్నిహితులు హ‌ర్షం వ‌క్తం చేస్తున్నారు.

స్వార్ధం కోసం.. చిరంజీవి పై అబ‌ద్ద‌పు ప్ర‌చారం

ఈమధ్య చిరంజీవి  గురించి అబధ్ధాల ప్రచారం ఎక్కువయ్యింది...గతం లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎలా చేసారో మళ్ళీ అలా...కొంతమంది స్వార్ధం కోసం చిరంజీవి మీద రకరకాలుగా కేవలం అబధ్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పులు తొడుక్కునేలోపల అబధ్ధం ప్రపంచాన్నే చుట్టివచ్చేస్తుందనే నానుడి ఋజువయ్యింది.ఆర్.కె.నాయుడు (చిరంజీవి అమ్&#

గర్ల్ ఫ్రెండ్ తో ఫస్ట్ టైమ్ కెమెరాకి చిక్కిన అఖిల్..!

అక్కినేని అఖిల్,జి.వి.కె మనవరాలు శ్రేయా భూపాల్ తో ప్రేమలో పడ్డాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

న‌వీన్ చంద్ర హీరోగా వేణుమూవీస్ సంస్థ కొత్త చిత్రం ప్రారంభం

రెండు ద‌శాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన వేణుమూవీస్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించింది. పసుపులేటి శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో న‌వీన్ చంద్ర హీరోగా జి.గోపి ద‌ర్శ‌క‌త్వంలో వేణుమాధ‌వ్ నిర్మాత‌గా రూపొందుతున్న కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.