ఆంధ్రా అంటే కులం కాదు - పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Monday,July 06 2015]

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నోటుకి వోటు కేసుకి సంబంధించి తన గళాన్ని ఈరోజు వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామలపై కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తాను ప్రస్తుత రాజకీయాలపై ప్రతిస్పందిస్తానని తెలియజేశారు. అన్నట్లుగానే ఈరోజు పవన్ స్పందనను తెలియజేశారు. ఆంధ్రా అంటే కులం కాదు, కేవలం ఒక చంద్రబాబు ఒక్కరే కాదు, చాలా మంది తెలుగు ప్రజలది.

అందులో చాలా మంది కులాలు, మతాలు ఉన్నాయి. తిడితే చంద్రబాబు, నన్ను కానీ తిట్టుకోండి అంతే కానీ జనాల్ని తిట్టవద్దు. రాజకీయ నాయకులు వారి వ్యాపారాలను రక్షించుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే.

అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని అడగాలి. కేంద్రం కుదరదంటే ఏం చేస్తారో చెప్పమనాలి. అలా చేయకుంటే తెలంగాణా రాజకీయ నాయకుల కంటే ఆంధ్రా పాలకులే ప్రజలకు అన్యాయం చేసివాళ్లవుతారు. మీకు కేంద్రం దగ్గరకు వెళ్లడానికి భయంగా ఉంటే రాజకీయాలను విడిచిపెట్టేయండంటూ పవన్ ఘాటుగానే స్పందించారు.

More News

రీమేక్ చిత్రంలో రామ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం శివమ్, హరికథ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రామ్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే తపన పడుతున్నాడు.

ప్రారంభమైన యంగ్ టైగర్ చిత్రం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ ఈరోజు(6) ండన్లో ప్రారంభమైంది.

బాలయ్య పాట పాడనున్నారా...?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ చిత్రం డిక్టేటర్ చిత్రీకరణకి రెడీ అయిపోతున్నాడు. రీసెంట్ గా లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

నయనకి తేదీ కుదిరింది...

హరర్ సినిమాల్లో నటించడం నయనతారకు ఇంతకు ముందు అలవాటు లేదు.

బాహుబలి లాంటి చిత్రం జీవితంలో ఒక్కసారే: ప్రభాస్

‘బాహుబలి’...టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు టోటల్ ఇండియా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది.