పవన్ 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'

  • IndiaGlitz, [Sunday,September 04 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని క్రియాశీల‌కం చేస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి అండ‌గా నిల‌బడ్డ ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో అసంతృప్తితో ఇటీవ‌ల తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి ప్ర‌త్యేక హోదా కోసం మూడంచెల పోరాటం చేస్తాన‌ని అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 9న కాకినాడ‌లో బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నాడు. ఈ స‌భ‌కు సీమాంధ్రుల ఆత్మ‌గౌర‌వ స‌భ అని పేరు పెట్టార‌ని స‌మాచారం. మ‌రి ఈ స‌భ త‌ర్వాత కేంద్రంలో ఏమైనా చ‌ల‌న వస్తుందో చూడాలి.