పవర్ స్టార్ అంతరంగం..!

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

యునైటెడ్ కింగ్ డ‌మ్ తెలుగు అసోసియేష‌న్ (UKTA) ఆర‌వ వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌య‌తే కూచిపూడి, జ‌య‌తే బ‌తుక‌మ్మ సాంస్కృతిక వేడుక‌లు లండ‌న్ త్రాక్సి లో ఇటీవ‌ల ఘ‌నంగా నిర్వ‌హించారు. సుమారు 1500 మంది పాల్గొన్న ఈ వేడుక‌ల‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ సూర్య‌నారాయ‌ణ శాస్త్రి గారు ప‌ద్య‌గానంతో ఆరంభించారు. అనంత‌రం నాట్యారామం బృందం ప్ర‌ద‌ర్శించిన ద‌శావ‌తారం మ‌హిషాసుర‌మ‌ర్ధిని, య‌క్ష‌గానం (భామా క‌లాపం, గాయ‌త్రీ వ‌న‌మాలి, భ‌క్త ప్ర‌హ్లాద‌) ఆద్యంతం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ వీక్ష‌కుల మ‌దిని దోచుకున్నాయి. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ యుకెటిఎ టీమ్ తో ప్ర‌త్యేకంగా సమావేశ‌మై త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు.
అది ప్ర‌తి తెలుగోడి బాధ్య‌త‌..!
ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.... సినిమాకి సంబంధించింది ఏదైనా చేయ‌చ్చు కానీ...నిర్ల‌క్షానికి గుర‌వుతున్న క‌ళ‌లను అంద‌రికీ గుర్తు చేసేలా ప్ర‌ద‌ర్శించ‌డం మామూలు విష‌యం కాదు. చిన్న‌ప్పుడు మా సిస్ట‌ర్స్ భ‌ర‌త‌నాట్యం నేర్చుకునేవాళ్లు. వాళ్ల‌తో పాటు నేను కూడా వెళ్లేవాడిని. భ‌ర‌త‌నాట్యం గురించి మాట్లాడేవారు కానీ.... కూచిపూడి గురించి ఎక్కువ‌గా మాట్లాడేవారు కాదు. ఫ‌స్ట్ టైమ్... ద‌శావ‌తారం మ‌హిషాసుర‌మ‌ర్ధిని, య‌క్ష‌గానం క‌ళ‌ల‌ను లైవ్ లో చూస్తుంటే అద్భుతం అనిపించింది. క‌ళ‌ల‌ను అంద‌రి ముందు ప్ర‌ద‌ర్శించాలి అంటే... ఇంట్ర‌స్ట్ ఉంటేనే చేయ‌గ‌ల‌రు.వాళ్లు అంతలా క‌ళ‌ల‌ను బ‌తికిస్తుంటే...మ‌నం ప్రొత్స‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ క‌ళ‌ల‌ను ప్రొత్స‌హించ‌డానికి ఇక్క‌డ ఉన్న తెలుగువారు అంద‌రూ ఒక‌టై చేయ‌డం అంటే ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి క‌ళ‌ల పై ఇంట్ర‌స్ట్ ఉండ‌డం వ‌ల‌నే నాకు ఏ మాత్రం అవ‌కాశం దొరికినా నా సినిమాల్లో ఎక్క‌డో చోట క‌ళల గురించి చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంటాను. మా నాన్న‌గారు జాబ్ చేయ‌డం వ‌ల‌న ఒక చోట ఉండ‌డం కుద‌ర‌లేదు. ఇంచుమించు అన్ని జిల్లాల్లో ఉండ‌డం వ‌ల‌న‌ రాయ‌ల‌సీమ‌, తెలంగాణ క‌ళల గురించి తెలుసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. క‌ళ‌ల‌ను ప్రొత్స‌హించ‌డం అనేది ప్ర‌తి తెలుగోడి బాధ్య‌త.
అంత‌కు మించి ఏమీ లేదు..!
నాకు ఏక్టింగ్ అంటే చిరంజీవి గారే. ఆయన్ని చూసి పెరిగాను. అందుచేత ఆయ‌న‌ ప్ర‌బావం నాపై ఉంటుంది. అయితే... ఏక్టింగ్ ప‌ట్ల ఎప్పుడూ ఇంట్ర‌స్ట్ లేదు. చిన్న‌ప్ప‌టి నుంచి నేను ఎవ‌ర్ని..? అని న‌న్ను నేను ప్ర‌శ్నించుకునేవాడిని. అందుకే అనుకుంట ఒక యోగి అయిపోవాలి అనుకునేవాడిని. సుస్వాగ‌తం స‌క్సెస్ త‌ర్వాత క‌ర్నూలు వెళ్లాం. న‌న్ను చూడ‌డానికి జ‌నం ఎవ‌రు వ‌స్తారు అనుకుంటే...ఊహించ‌ని విధంగా ఇసుకేస్తే రాల‌నంత‌ జ‌నం వ‌చ్చారు. అలా చిరంజీవి గార్కి చూసాను. న‌న్ను చూడ‌డానికి జ‌నం రావ‌డం ఆశ్చ‌ర్యం అనిపించింది. అప్పుడు ఫ‌స్ట్ టైమ్ నాలో ఒక స్థ‌బ్ద‌త ఏర్ప‌డింది. అప్పుడు మ‌న‌సులో ఏమ‌నిపించింది అంటే.... సృష్టిలో భ‌గ‌వంతుడు కొంత‌మందిని ప‌ర్ ఫార్మ్ చేసేవాళ్లుగా, కొంద‌మందిని అప్రిషియ‌టే చేసేవాళ్లుగా పుట్టిస్టాడు అంత‌కు మించి ఏమీ లేదు అనిపించింది. నేను ఎంత చేసినా సెల్ప్ సెర్చ్ గురించి ఆలోచిస్తుంటాను.
అందుకే...అన్న‌య్య అంటే గౌర‌వం..!
ఏక్ట‌ర్ కాక‌పోతే యెగి అయ్యేవాడినేన‌మో. లేక‌పోతే రైతు ని అయ్యేవాడినేమో అనిపిస్తుంటుంది. వ్య‌వ‌సాయం చేస్తే ప్ర‌కృతి ప‌ట్ల గౌర‌వం పెరుగుతుంది. నాన్న కానిస్టేబుల్.. తాత‌య్య పోస్ట్ మాస్ట‌ర్. సిటీలో ఉన్న సెంట‌ర్ కి వెళ్లి సినిమా చూస్తే అదో పెద్ద పండ‌గ‌లా ఉండేది. అంతే కానీ..ఎప్పుడూ సినిమాల్లోకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌లేదు. అయితే....ఆన్న‌య్య సినిమా రంగంలో ప్ర‌వేశించాల‌ని క‌ల గ‌ని... విప‌రీతంగా క‌ష్ట‌ప‌డి ఎన్నో దెబ్బ‌లుతిని ఈ స్ధాయికి వ‌చ్చాడు.అందుకే అన్న‌య్య అంటే గౌర‌వం. ఖుషీ త‌ర్వాత మూడు సినిమాలు స‌క్సెస్ అయ్యుంటే అప్పుడే సినిమాల్లో న‌టించ‌డం ఆపేసేవాడిని. నేను రెగ్యుల్ ఏక్టింగ్ చేయ‌లేను. ప్రొఫిషిన‌ల్ ఏక్ట‌ర్ ని కాను అంటూ త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు.

More News

'త్రివిక్రమన్' ప్రచార చిత్రం విడుదల!!

"త్రివిక్రమపాండ్యన్" అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం "త్రివిక్రమన్".

'మజ్ను' ఆడియో రిలీజ్ డేట్....

భలే భలే మగాడివోయ్,జెంటిల్ మన్ వంటి వరుస సక్సెస్ లు సాధించిన నేచురల్ స్టార్ నాని

42 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య..!

నందమూరి నట సింహం బాలయ్య 42ఏళ్లు పూర్తి చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..?నటరత్న నందమూరి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తాతమ్మకల.

విశాల్ అప్పుడే డబ్బింగ్ మొదలేట్టేశాడు....

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణ లో హరి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై సురాజ్ దర్శకత్వంలో జి.హరి నిర్మిస్తున్న చిత్రం

పవన్ సినిమా టైటిల్....?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి చిత్రానికి రంగం సిద్ధమవుతుంది.