నన్ను చూడటానికి ఎవరొస్తారులే అనుకున్నా: పవన్

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

తన గురించి తానెప్పుడూ ఆలోచించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా జనసేన పార్టీ మీడియా విభాగంతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్య తరగతి ఆలోచనా దృక్పథంతో ఉన్నానో.. ఇప్పటికీ అలాగే ఉన్నానని పవన్ తెలిపారు. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు తాను కర్నూలుకి వెళ్లానని.. అక్కడ రోడ్ షో చేస్తూ తీసుకెళతామన్నారని.. అయితే తాను ఎందుకు అని అడగ్గా.. మిమ్మల్ని చూసేందుకు చాలా మంది వచ్చారన్నారని తెలిపారు. తనను చూడటానికి ఎవరొస్తారులే అనుకున్నానని.. కానీ దారి పొడవునా జన సందోహమని చెప్పుకొచ్చారు.

‘‘నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాగే ఎక్కువగా ఊహించుకోను. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్యతరగతి ఆలోచన దృక్పథంతో ఉన్నానో... ఇప్పుటికి అదే విధంగా జీవిస్తున్నాను. నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలంటే ఇబ్బంది పడుతూనే కర్నూలు వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాకా రోడ్ షో చేస్తూ తీసుకెళ్తాం అన్నారు. దేనికి అని అడిగాను. మిమ్మల్ని చూడటానికి జనం చాలా మంది వచ్చారు అని చెప్పారు. నన్ను చూడటానికి ఎవరొస్తారు అనుకున్నాను. ఆ వాహనం ఎక్కేటప్పటికీ దారి పొడువునా విపరీతమైన జనం ఉన్నారు.

వీళ్లందరు నన్ను చూడటానికే వచ్చారా అనుకున్నాను. నాకు అప్పుడే అనిపించింది వాళ్లకు నాకు మధ్య పెద్ద తేడా లేదు. వాళ్లు అటువైపు ఉన్నారు... నేను ఇటువైపు ఉన్నాను అంతే అని. అటువంటి ఆలోచనా విధానం వచ్చింది తప్ప నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారనే ఆలోచన విధానం ఎప్పుడు లేదు. నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం. వారికి నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఇందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

More News

అలా నేను, మా ఇంట్లో వాళ్లం నా బర్త్‌డేని మరచిపోయేవారం: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకొని జనసైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం!

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్ర‌భాస్ బాట‌లో మ‌హేశ్ కూడా...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’.

టార్గెట్ ఫిక్స్ చేసిన ప‌వ‌న్‌!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

కార్తీక్ రాజు దర్శకత్వంలో ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘ది ఛేజ్’

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’, లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’