ఇంటర్నెట్ లో అకీరా వీడియో దుమారం.. తండ్రిలాగే కొడుకు కూడా..

  • IndiaGlitz, [Tuesday,August 03 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు అభిమానులకు గుర్తుకు వచ్చేది మార్షల్ ఆర్ట్స్. కెరీర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో కొంతవరకు శిక్షణ తీసుకున్నారు. తన సినిమాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ ని పవన్ చేశారు. పవన్ కి క్రేజ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం అయింది.

ఇదీ చదవండి: బ్రతికున్నందుకు జీవితాంతం బాధపడతా: యషిక ఆనంద్

లేటెస్ట్ గా పవన్ తనయుడు అకీరా నందన్ వీడియో ఒకటి దుమారం రేపుతోంది. ఈ వీడియో చూస్తుంటే అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు ఉన్నాడు. కర్రసాములో కర్రని వేగంగా తిప్పుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. టీనేజ్ లోనే ఆరడుగులు దాటేసిన అకీరా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ వీడియో చూశాక పవన్ అభిమానుల రచ్చ సోషల్ మీడియాలో మరింత ఎక్కువైంది. తండ్రి లాగే కొడుకు కూడా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అకీరా త్వరగా సినిమాల్లోకి వచ్చేయాలని కోరుతున్నారు. అంతే కాదు.. అనదర్ స్టార్ ఇన్ మేకింగ్ అని.. అకీరా ఎవరి డైరెక్షన్ లో లాంచ్ అయితే బావుంటుందో కూడా ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జానీ 2 టైటిల్ తో అకీరా ఫస్ట్ మూవీ ఉండాలని, ఆ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.

More News

బ్రతికున్నందుకు జీవితాంతం బాధపడతా: యషిక ఆనంద్

ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ యషిక ఆనంద్ గత వారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

నారా లోకేష్ లేటెస్ట్ పిక్ వైరల్.. క్రేజీ లుక్ లో టీడీపి యంగ్ బాస్!

మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, టిడిపి యువ నేత నారా లోకేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

పవన్ - రానా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. అతి త్వరలో ఫస్ట్ సింగిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది.

ఆ క్రెడిట్ తన కొడుక్కే ఇచ్చిన రాజమౌళి.. దోస్తీ సాంగ్ పై తొలిసారి..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాలు మొదలు పెట్టింది.

'పరిగెత్తు పరిగెత్తు' మూవీ రివ్యూ!

క్రైమ్ జోనర్ లో తెరకెక్కే థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది.