2024 కల్లా పవన్ టార్గెట్ రూ. 500 కోట్లు..!

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు కూడా చేయడానికి పవన్ సిద్ధమయ్యాడని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే 2024 కల్లా టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారంటే.. సార్వత్రిక ఎన్నికలు అప్పుడు జరుగుతాయ్ గనుక.. దాన్నే టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం అనే విషయం తెలిసిందే. అందుకే రానున్న ఎన్నికల్లా రూ. 500 కోట్లు సంపాదించి తీరాల్సిందేనని.. ఈసారి రంగంలోకి దిగితే సీఎం అయిపోవాలని మైండ్‌లో బ్లైండ్‌గా జనసేనాని ఫిక్సయ్యారట.

ఇక వరుస సినిమాలే..!

పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రిష్‌తో.. ఆ తర్వాత హరీశ్ శంకర్‌తో సినిమాలు ఉన్నాయి. అంతేకాదు త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్, డాలీ ఇలా చాలా మంది డైరెక్టర్లు లైన్‌‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు 50 నుంచి 75 కోట్ల వరకు పవన్ పారితోషికం పుచ్చుకుంటారని టాక్.. ఆ లెక్కన పెట్టుకుంటే గట్టిగా 10 నుంచి 12 సినిమాలు చేసేస్తే ఆయన అనుకున్న డబ్బులు వచ్చేస్తాయంతే. అందుకే ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసేయాలని పవన్ భావిస్తున్నాడట.

అవసరమైతే నిర్మిస్తా!

వాస్తవానికి పార్టీని నడపాలన్నా.. ఎన్నికలకు వెళ్లాలన్నా గట్టిగానే ఖర్చు అవుతుంది. అదెలాగా అనేది ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అందుకే పార్టీని నడపడానికి తన దగ్గర డబ్బుల్లేవ్ అని పవన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో పవన్ ఇలా సినిమాల రూపంలో సంపాదించాలని భావిస్తున్నారట. అంతేకాదు.. వీలైతే సినిమాలు నిర్మించడానికి కూడా పవన్ సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే ప్రకటించారన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మించాలని ఉందని పలు ఇంటర్వ్యూల్లో పవన్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

అంటే అన్ని కోట్లు సంపాదించేసి 2024లో గట్టిగా ఖర్చుపెట్టేసి సీఎం అయిపోవాలని పవన్ భారీగానే ప్లాన్ వేశారన్న మాట. అయితే.. రూ. 500 కోట్ల వ్యవహారంలో నిజానిజాలెంత..? ఒకవేళ అదే నిజమైతే పవన్ 2024లోపు పెట్టుకున్న ఈ టార్గెట్‌ను నిజంగానే రీచ్ కాగలడో లేదో తెలియాలంటే సినిమాలు లైన్‌లోకి వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

More News

‘పింక్’ రీమేక్ : ట్రెండ్ సెట్ చేస్తున్న థమన్!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నెల 29 న వైజాగ్ లో 'భీష్మ'  విజయోత్సవ వేడుక

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది.

చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డు ఔట్

ఇంటి దొంగలను పనిపట్టే పనిలో జనసేన సిద్ధమవుతోందని.. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలపాలు సాగించినా లీగల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని

ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు త్రినయని సీరియల్‌తో మీ ముందుకు వస్తోన్న జీ తెలుగు

అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్‌, అంతకుమించిన రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని జీ తెలుగు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

‘ఇండియ‌న్ 2’ ప్ర‌మాదంపై శంక‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.