సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న పవన్?

  • IndiaGlitz, [Wednesday,February 03 2021]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లుక్ సరికొత్తగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో సెట్లు కళ్లు చెదిరేలా ఉండబోతున్నాయని సమాచారం. మొత్తమ్మీద ఈ చిత్రం ‘మొఘల్‌ ఎ ఆజమ్‌’ తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై ఒక పాట సహా పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ కీలక పాత్రలో కనిపించనుంది. శ్రీసూర్య మూవీస్‌ అధినేత ఎ.యం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏఎమ్ రత్నం 150 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జూన్‌ లేదా జూలై నాటికి ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత మూడు, నాలుగు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కేటాయించి... ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే పవన్ సంక్రాంతినే ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనుండటంతో పాటు ఇది ఒక పిరియాడికల్ మూవీ అవడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

More News

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్న 'A' ట్రైలర్!!

ప్రస్తుతం రాబోతున్న చిత్రాలలో "A" సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.

‘ఆదిపురుష్‌’ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం..!

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మూడో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్‌’ మంగ‌ళ‌వారం ముంబైలోని గోరేగాన్‌ స్టూడియోలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇలాంటి గౌరవం ఏ గురువుకూ దక్కదేమో...

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. గురువు స్థానాన్ని దైవం కంటే ముందు పెట్టారు పెద్దలు. అంతటి ఉన్నతమైన స్థానం గురువుకి ఉంది.

థియేటర్లకు ఫుల్ పర్మిషన్.. సినిమాల రిలీజ్‌కు నిర్మాతల ఆసక్తి

కరోనా లాక్‌డౌన్ సమయంలో భారీగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. సినిమాల్లేక చిన్న చిన్న ఆర్టిస్టుల కుటుంబాలు చితికిపోయాయి.

‘ఆచార్య‌’లో మ‌రో స్టార్‌.. నిజ‌మెంత‌?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో