close
Choose your channels

లగ్జరీ కారు కొనుగోలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంత ఖరీదా?

Wednesday, June 30, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లగ్జరీ కారు కొనుగోలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంత ఖరీదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త కారు కొనబోతున్నారట. గత ఆరేళ్ళ నుంచి పవన్ పాత కారునే ఉపయోగిస్తున్నారు. దీనితో కొత్త కారుని తన వ్యక్తిగత అవసరాల కోసం కొనాలని డిసైడ్ అయ్యారట.

అందుతున్న సమాచారం మేరకు అతి కొద్దిమంది సెలెబ్రిటీలు వాడే ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడల్ కారుని పవన్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కారు పవన్ ఇంటికి డెలివరీకి రానున్నట్లు తెలుస్తోంది. రేంజ్ రోవర్ ఎస్ యు వి ఆటోబయోగ్రఫీ మోడల్ కారు ఖరీదు రూ 4.5 కోట్ల వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. 'అఖండ' కడపలో అంట!

టాలీవుడ్ లో చాలా తక్కువమంది సెలెబ్రిటీలు ఈ కారుని ఉపయోగిస్తున్నారు. ఆ జాబితాలోకి పవన్ కూడా చేరనున్నారు. పవన్ గతంలో కూడా ఖరీదైన కారులనే ఉపయోగించేవారు. కానీ ఈ కారు ధర అత్యధికం.

రాజకీయ కార్యక్రమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. పవన్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ లో విడుదలై ఘనవిజయం సాధించింది. వకీల్ సాబ్ చిత్రానికి పవన్ రూ 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియం చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.