close
Choose your channels

బాలీవుడ్ యాక్ట‌ర్‌తో ఫైట్ చేయ‌బోతున్న ప‌వ‌న్‌

Thursday, February 27, 2020 • తెలుగు Comments

బాలీవుడ్ యాక్ట‌ర్‌తో ఫైట్ చేయ‌బోతున్న ప‌వ‌న్‌

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్‌తో పాటు డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. భారీ సెట్స్‌లో పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌బోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు ధీటుగా న‌టించ‌బోయే విల‌న్ పాత్ర‌ల‌కు బాలీవుడ్ న‌టుడ్ని తీసుకోవాల‌ని క్రిష్ యోచిస్తున్నాడ‌ట‌.

ముఖ్యంగా బాలీవుడ్ యాక్ట‌ర్ అర్జున్ రాంపాల్‌తో ప‌వ‌న్ డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ఇప్పుడు బాలీవుడ్ తార జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ కూడా హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ పింక్ రీమేక్ వ‌కీల్‌సాబ్‌లో త‌న పార్ట్‌ను మార్చికంతా పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మార్చిలో క్రిష్ సినిమా స్టార్ట్ చేస్తాడ‌ట‌. మూడు నెల‌ల్లో క్రిష్ సినిమాను పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అంతా పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

Get Breaking News Alerts From IndiaGlitz