close
Choose your channels

ఈ నేతలందరికీ పవన్ టికెట్లిస్తారా..!?

Saturday, January 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ నేతలందరికీ పవన్ టికెట్లిస్తారా..!?

యువతను ఆదరిస్తా..! యూత్ రాజకీయాల్లోకి రావాలి..! యువకులకు టికెట్లిచ్చి ప్రోత్సహిస్తా.. 60 శాతం యువకులకే టికెట్లు ఇస్తానంటున్న జనసేనాని అధినేత పవన్ కల్యాణ్.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపు నేతలకు ఏ మాత్రం న్యాయం చేస్తారనే వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే టీడీపీ, వైసీపీ అధినేతలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం తొలి జాబితాను ప్రకటించాలని పవన్ భావిస్తున్నారు. ఇలా చేస్తే టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని అసంతృప్తులు జనసేన కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. ఇలా జరిగితే పార్టీకి కూడా కాసింత ప్లస్ అవుతుందని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 26న తొలి జాబితా..!
కోస్తాఆంధ్రపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కల్యాణ్.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో కలిపి మొత్తం 60 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసే అవకాశముంది. ఈ నెల 13న గుంటూరు జిల్లా తెనాలికి వెళ్లనున్న పవన్.. జిల్లా కార్యకర్తల, నేతలతో రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడలో పర్యటించి అనంతరం తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

విశాఖ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు వీరే..
విశాఖపట్నం పార్లమెంటు: బొలిశెట్టి సత్య, గేదెల శ్రీనుబాబు పోటాపోటీ
అనకా పల్లి ఎంపీ: ముత్తంశెట్టి కృష్ణారావు
విశాఖ తూర్పు: ఎం.రాఘవరావు (చిరంజీవి అభిమానుల సంఘం నాయకుడు)
విశాఖ పశ్చిమ: టిక్కెట్‌ డాక్టర్‌ సునితి, పీవీ సురేశ్‌
విశాఖ ఉత్తరం: గుంటూరు భారతి, పసుపులేటి ఉషాకిరణ్‌, ముద్రగడ పద్మనాభం శిష్యుడు తోట రాజీవ్‌
కాగా.. వైసీపీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఉషా కిరణ్.. కొద్దిరోజుల క్రితం పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ ఇస్తారనే నమ్మకంతోనే ఆమె పార్టీ మారినట్లుగా తెలుస్తోంది. తనకు టికెట్ ఇస్తే కాపులు, ముద్రగడ మానియాతో కచ్చితంగా గెలుస్తానని తోట రాజీవ్.. జనసేనానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
విశాఖ దక్షిణ: వైసీపీ నుంచి వచ్చిన గంపల గిరిధర్‌, రాహుల్‌
భీమిలి: విద్యాసంస్థల అధినేత అలివర్‌ రాయ్‌, ముత్తంశెట్టి కృష్ణారావు
పెందుర్తి: మండవ రవికుమార్‌
గాజువాక: మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి
కాగా ఈ నియోజకవర్గం నుంచి చింతలపూడికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అరకు అసెంబ్లీ: సీతారామ్‌, గంగులయ్య
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప
చోడవరం: పీవీఎస్‌ఎన్‌ రాజు
ఎలమంచిలి: సుందరపు విజయకుమార్‌, మాడుగులకు పూడి మంగపతిరావుల
పాయ కరావుపేట: నక్కా రాజారావు, శివదత్తు, గెడ్డం బుజ్జి
విశాఖ ఏజెన్సీ: మాజీ మంత్రి బాలరాజు (ఏజెన్సీ టికెట్ కుదరకపోతే అరకు పార్లమెంటుకు గానీ, పాడేరు అసెంబ్లీకి గానీ పోటీ చేసే అవకాశం)

ఇప్పటి వరకూ జనసేనలో చేరిన కీలకనేతలు వీరే..
రాజోలు: మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
పి. గన్నవరం: పామలు రాజేశ్వరి
పాలకొల్లు: హరి రామజోగయ్య
ప్రత్తిపాడు(గుంటూరు): రావెల కిశోర్ బాబు
తిరుపతి : చదలవాడ కృష్ణమూర్తి
తెనాలి: నాదెండ్ల మనోహర్

కాగా.. వీరితో పాటు పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అసంతృప్తులు ఎన్నికలకు ముందే జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. మరోవైపు.. పలువురు ప్రజారాజ్యం తర్వాత జనసేనలోకి జంప్ అవ్వగా.. ఎక్కువ శాతం మంది ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. పైనున్న నేతల్లో ఎంత మంది పేర్లు తొలి జాబితాలో ఉంటాయి..? అయితే పార్టీలో స్థిరంగా ఉండేవాళ్లు ఎంతమంది..? ఇతర పార్టీల నుంచి వచ్చేవారి లెక్కలు తేలాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.