close
Choose your channels

పవన్ కీలక నిర్ణయం: యువ ద‌ర్శ‌కుడితో జ‌ట్టు

Saturday, November 2, 2019 • తెలుగు Comments

పవన్ కీలక నిర్ణయం: యువ ద‌ర్శ‌కుడితో జ‌ట్టు

2019 ఎన్నిక‌లు త‌ర్వాత జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతూనే ఉన్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ర్గం నుండి దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేకున్నా.. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడ‌ట‌. ప‌వ‌న్‌తో సినిమాలు చేయ‌డానికి చాలా మంది నిర్మాత‌లు ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. వారిలో దిల్‌రాజు, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎ.ఎం.ర‌త్నం ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీరిలో ముందుగా దిల్‌రాజుతో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ రీమేక్ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ సినిమా ఏదో కాదు.. వార్త‌ల్లో వినిపించిన‌ట్లే బాలీవుడ్ చిత్రం `పింక్‌`. ఈ సినిమాను తమిళంలో ఇప్ప‌టికే రీమేక్ చేశారు. ఇప్పుడు ప‌వ‌న్ రీమేక్‌లో న‌టించ‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాను యువ ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నాడు. కేవ‌లం రెండు సినిమాల‌ను మాత్ర‌మే డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ వంటి యువ ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావ‌డం అంటే గొప్ప విష‌య‌మే. త్వ‌రలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz