close
Choose your channels

ప‌వ‌న్ ట్రీట్ రెడీ అవుతోంది..!

Thursday, February 25, 2021 • తెలుగు Comments

ప‌వ‌న్ ట్రీట్ రెడీ అవుతోంది..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం హైదరాబాద్‌లో చ‌క చ‌కా జ‌రుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నాడు. వ‌స్తాదుల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫైట్ సీక్వెన్స్‌ల‌ను యూనిట్ చిత్రీక‌రిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థ‌లంలో వేసిన గండిపేట సంస్థానం, ఛార్మినార్ సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మొఘ‌ల్ కాలానికి చెందిన క‌థాంశంతో సినిమాను క్రిష్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మొఘ‌ల్ చ‌క్ర‌వర్తి ఔరంజేబు పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ న‌టిస్తుండగా నిధి అగ‌ర్వాల్‌, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇందులో బందిపోటు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. కాగా.. ఈసినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను మ‌హా శివ‌రాత్రి సందర్భంగా మార్చి 11న విడుద‌ల చేస్తున్నారు.

రీఎంట్రీ త‌ర్వాత ప‌వ‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన వ‌కీల్‌సాబ్‌.. ఏప్రిల్ 9న విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు క్రిష్ సినిమాతో పాటు మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ రీమేక్‌లోనూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz