ఒకేసారి 10మంది మల్ల యోధులతో పవన్.. 'వీరమల్లు' ఫైట్ లీక్

  • IndiaGlitz, [Tuesday,June 29 2021]

క్రమంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందే క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. పీరియాడిక్ నేపథ్యంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దర్శకుడు క్రిష్ పకడ్బందీ ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఈ చిత్రం కోసం 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఖుషి, బంగారం లాంటి చిత్రాలు తెరకెక్కించిన ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ఈ తరహా పీరియాడిక్ డ్రామాలో నటించడం పవన్ కు ఇదే తొలిసారి.

ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ అత్యంత కీలకం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలకు సన్నివేశాలు లీక్ కావడం కాస్త కలవరపెట్టే అంశమే. షూటింగ్ లొకేషన్ నుంచే ఎవరో ఒకరు వీడియో తీసి వైరల్ చేసేస్తుంటారు. వీరమల్లు సెట్స్ నుంచి కూడా ఓ ఆసక్తికరమైన వీడియో లీక్ అయింది.

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఎవరో లీక్ చేశారు. పది మంది మల్ల యోధులు ఉక్కు కండలతో సై అంటుంటే వారి ఎదురుగా పవన్ నిలబడి ఉన్నారు. మల్ల యోధులని ఒక్కరిని ఎదుర్కొనడమే కష్టం. అలాంటిది పవన్ ఏకంగా 10మందితో తలపడుతున్నాడు.

పవన్ వారిని ఎంత పవర్ ఫుల్ గా ఎదుర్కొంటాడో ఊహించుకుంటుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో మెరవనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబుగా కనిపించబోతున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

మరోవైపు పవన్ అయ్యప్పన్ కోషియం రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల షూటింగ్ పార్లల్ గా ఫినిష్ కానున్నాయి. ఆ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో క్రేజీ చిత్రం మొదలవుతుంది.

More News

మెగాస్టార్ 153: మంచి కిక్కిచ్చే అప్డేట్.. మోత మోగడం ఖాయం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఆలోచింపజేసేలా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ లుక్!

శర్వానంద్ 30వ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది.

హైదరాబాద్ మరో అద్భుతం.. ఇక నేరగాళ్ల పని అంతే, అతి త్వరలో..

హైదరాబాద్ లో మరో అద్భుత ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది.

వందల కోట్లల్లో ఈ చిత్రాల పెట్టుబడి.. థర్డ్ వేవ్ వచ్చేలోపు వచ్చేస్తాయా..

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా సినిమా రంగ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చిన్న చిత్రాలు ఓటిటి వేదికల్ని వెతుక్కుంటున్నాయి.

8 జిల్లాల్లో ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. కొత్త నిబంధనలు ఇవే!

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధలని సడలిస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.