Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త ఇల్లు ఇదే.. ఏ గ్రామంలో అంటే..?

  • IndiaGlitz, [Saturday,April 06 2024]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు చూసుకుంటా.. ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. అందుకు తగ్గట్లే ఓ రైతు నిర్మించిన మూడుంతస్తుల భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్‌ రోడ్డు పక్కన పంటపొలాల్లో ఓదూరి నాగేశ్వరరావు అనే రైతలు ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. నియోజకవర్గంలో తన సొంతింటిని నిర్మించుకునేవరకూ ఇక్కడే ఉంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

శుక్రవారం గృహప్రవేశం కూడా పూర్తి కాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల పార్కింగ్‌కు, మొదటి ఫ్లోర్‌లో ఆఫీసు నిర్వహణకు, రెండు, మూడు అంతస్తులు కలిపి డూప్లెక్సు తరహాలో నిర్మించారు. ఈ బిల్డింగ్ అయితే పవన్‌కు వసతితో పాటు రాజకీయ కార్యక్రమాలకు అనువుగా ఉంటుందని భావించి అద్దెకు తీసుకున్నారు. అయితే రైతు నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో తన ఇంటిని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు. తనకు అద్దె వద్దని కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని చెబుతున్నారు.

ఉగాది వేడుకలను ఈ ఇంట్లోనే జరుపుకోనున్నారు. ఈ లోపు ఇంటికి తుది మెరుగులు దిద్ది సిద్ధం చేయనున్నారు. అలాగే ఇంటికి సమీపంలోని పంటపొలాల్లో హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులు కూడా ప్రారంభించారు. మొత్తానికి నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పవన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు తీవ్ర జ్వరం నుంచి కోలుకున్న సేనాని.. ఆదివారం నుంచి వారాహి విజయభేరి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడ నిర్వహించే బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు.

ఏప్రిల్ 7న అనకాపల్లిలో ర్యాలీతో పాటు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఏప్రిల్ 8న యలమంచిలిలో పర్యటిస్తారు. అనంతరం ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి పంచాంగ శ్రావణం వేడుకలో పాల్గొంటారు. తదుపరి నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో రెండు సార్లు ప్రచారం నిర్వహించడంతో పాటు కూటమి తరపున నిర్వహించే భారీ బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. కాగా పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది.

More News

Pawan Kalyan: జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్.. తిరిగి ప్రచారం మొదలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో వారాహి విజయభేరి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

Kavitha: కవితకు వరుస ఎదురుదెబ్బలు.. సీబీఐ విచారణకు కోర్టు అనుమతి..

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కవితను విచారిస్తామని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.

తెలంగాణలోని అసైన్డ్ భూముల కబ్జా వివాదంలో టీడీపీ నేత

తెలుగు రాష్ట్రాల్లో ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నేతల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవినీతిపరులందరూ ఆ పార్టీలోనే ఉంటారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలే హస్తం పార్టీ కండువా కప్పుకోగా.. తాజాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలి: షర్మిల

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని ప్రజలకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.