బర్త్‌డే విషెస్ చెప్పిన సత్యదేవ్‌కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పవన్..

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డేకి అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలంతా తమ ట్వీట్లతో ట్విటర్‌ను హోరెత్తించారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ హీరో సత్యదేవ్ కూడా పవన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. అయితే సత్యదేవ్‌కి పవన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. దీంతో సత్యదేవ్ సంబరపడిపోయారు.

పవన్ పుట్టినరోజు సందర్భంగా సత్యదేవ్.. ‘ఒకే ఒక పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌గారికి హ్యాపీ బర్త్‌డే. జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు పవన్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సత్యదేవ్‌గారు. మీ లేటెస్ట్ సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో మీ నటనను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆల్ ది బెస్ట్’ అని రిప్లై ఇచ్చారు. పవన్ నుంచి వచ్చి ఈ ఊహించని రిప్లైకి సత్యదేవ్ తెగ సంబరపడిపోయారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రశంస తనకు లభించిన బహుమతిగా ఫీలయ్యాడు.

వెంటనే సత్యదేవ్.. ‘ధన్యవాదాలు సర్. మీ ప్రశంసను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ పుట్టిన రోజునాడు నాకు బహుమతి అందించినందుకు మరోసారి ధన్యవాదాలు సర్. మీ మెసేజ్‌తో మా టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉంది’ అని రిప్లై ఇచ్చాడు. నిజానికి ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో సత్యదేవ్ నటనకు విపరీతంగా ప్రశంసలు వచ్చాయి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఆ సినిమా మొత్తం సాగినప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సత్యదేవ్ నటన చాలా సహజంగా అనిపించింది. ఒక రకంగా ఆయన తన పాత్రలో జీవించేశాడు.

More News

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. విరాళాలు కోరిన హ్యాకర్లు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విటర్ వెల్లడించింది.

7 నుంచి మెట్రో ప్రారంభం.. ట్రైన్ ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణలో మెట్రో రైలు సర్వీస్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. తొలిసారిగా..

భారత్‌లో నిన్న కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించింది.