close
Choose your channels

పవన్ ‘పింక్’ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్!?

Monday, February 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ ‘పింక్’ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్!?

టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు. అయితే సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో మాత్రం ఆయన రాణించలేకపోయారు. అయినప్పటికీ ప్రజా సమస్యల కోసం.. పోరాడుతూ ఇటు కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే తనపై చాలా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తప్పకుండా సినిమాల్లో నటించాల్సిందేనని చెప్పిన పవన్.. ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా పవన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 15 రోజుల నుంచి పవన్ నాన్‌స్టాప్‌గా మూడో కంటికి తెలియకుండా షెడ్యూల్ ప్లాన్ చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్.. రహస్య ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి మరో పుకారు షికారు చేస్తోంది. సినిమాను వీలైనంత త్వరగా అంటే.. నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే-15న విడుదల చేయాలని చిత్ర నిర్మాత దిల్‌రాజు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ సినిమా కోసం ఎన్నాళ్లుగా వేచి చూసిన వీరాభిమానులకు పండుగే పండగ. వాస్తవానికి మే నెల అంటే దిల్‌రాజుకు అచ్చొచ్చిన నెల. ఎందుకంటే ఈ నెలలో తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు రిలీజ్ అవ్వగా దాదాపు అన్నీ సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాకుండా ఊహించిన దానికంటే ఎక్కువగానే కలెక్షన్లు వచ్చాయట. అందుకే ‘పింక్‌’ రీమేక్‌ను కూడా అలాగే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. మరి ఇందులో నిజానిజాలెంత..? ఒకవేళ ఇదే నిజమైతే దిల్ రాజు సెంటిమెంట్..? పవన్ రీ ఎంట్రీ చిత్రం ఏ మాత్రం కలిసొస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.