గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన పాయ‌ల్‌.. డైరెక్ట‌ర్‌కి స‌మ‌న్లు

  • IndiaGlitz, [Wednesday,September 30 2020]

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారిని క‌లిసింది. జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ఆయ‌న‌కు వివ‌రించి త‌నకు భ‌ద్ర‌త క‌ల్పించ‌మ‌ని, వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పాయ‌ల్ కోరింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. ‘‘గౌరవనీయులైన గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారీగారిని ఈరోజు కలిశాను. ఆయనతో సమావేశం గొప్పగా జరిగింది. నన్ను ఆపేవాళ్లు, విమర్శించేవాళ్లు, అభ్యంతరం చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నేను వేటికీ ఆగకుండా ముందుకెళ్తాను’’ అన్నారు పాయ‌ల్. ఈ మీటింగ్‌కు పాయ‌ల్ లాయ‌ర్ సాత్నుటే పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు రాందాస్ అథ‌వాలే ఉన్నారు.

అంతే కాకుండా అప్ప‌టికే అనురాగ్‌క‌శ్య‌ప్‌పై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల క్రితం వెర్సోవాలోని యారి రోడ్డులో క‌శ్య‌ప్ త‌న‌పై బ‌లాత్కార ప్ర‌య‌త్నం చేశాడ‌ని పాయ‌ల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును స్వీక‌రించిన వెర్సోవా పోలీసులు అనురాగ్‌కు స‌మ‌న్లు పంపారు. అనురాగ్‌ను రేపు స్టేష‌న్‌కు రావాలన్నారు. మ‌రి రేపు అనురాగ్ పోలీసుల‌కు ఏం చెబుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

బీచ్‌లో ర‌ష్మిక.. తొలిసారి అంటూ..!

క‌న్న‌డ చిత్రం ‘కిరిక్‌పార్టీ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా, త‌దుప‌రి తెలుగులో ‘ఛ‌లో’తో హీరోయిన్‌గా ప్ర‌వేశం చేసింది.

ప్రియమణి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ 'సైనైడ్'

జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించనున్న చిత్రం 'సైనైడ్'.

అక్కడ షూట్ చేయడం ఫస్ట్ టైం.. చాలా ఎంజాయ్ చేశాం: అనుష్క

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’.

`ఒరేయ్‌ బుజ్జిగా..` ప్రీ రిలీజ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్లు సంచలన తీర్పు..

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాదాపు 28 ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌‌ లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది.