ద‌ర్శ‌కుడిని త‌ప్పు ప‌డుతున్న పాయ‌ల్‌ ?

  • IndiaGlitz, [Monday,March 23 2020]

తొలి చిత్రం ఆర్‌.ఎక్స్ 100తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన పాయ‌ల్ రాజ్‌పుత్ ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హాట్ అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి ద‌గ్గ‌రైన పాయ‌ల్ రాజ్‌పుత్ ‘వెంకీమామ’ చిత్రంలో వెంక‌టేశ్ జ‌త‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాయ‌ల్ త‌న పాత్రను డిజైన్ చేసిన‌ట్లు తీరుపై అసంతృప్తిగా ఉంద‌ట‌. వెంకీమామ‌లో పాయ‌ల్ టీచ‌ర్ పాత్ర‌లో న‌టించింది. ఈ పాత్ర‌ను డైరెక్ట‌ర్ బాబీ అంటీ పాత్ర‌లా చూపించాడ‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర పాయ‌ల్ బాధ‌ప‌డుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

రీసెంట్‌గా బాల‌కృష్ణ 106వ చిత్రంలో పాయ‌ల్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వెంట‌నే ఆ వార్త‌ల‌ను పాయ‌ల్ కొట్టిపారేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆమెపై వ‌స్తున్న పుకార్ల‌పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. వెంకీమామ‌లో పాత్ర ప‌రంగా చూస్తే పాయ‌ల్‌కు మంచి ప్రాధాన్య‌తే ద‌క్కినప్ప‌టికీ వెంక‌టేశ్ స‌ర‌స‌న ఆమె పాత్ర‌ను బాబీ డిజైన్ చేసిన తీరు న‌చ్చ‌లేద‌ట‌. ఎఫ్ 2లో త‌మ‌న్నా కూడా వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌టించినా..ఆమె పాత్ర‌ను ద‌ర్శ‌కుడు అనిల్ చ‌క్క‌గానే చూపించాడ‌ట‌. కానీ బాబీ అలా చూపించ‌డం లేదని బాధ‌ప‌డుతుంద‌ట‌. ఏదేమైనా ఇప్పుడు పాయ‌ల్‌ను ప‌ట్టించుకునేవారే లేక‌పోయారు.

More News

నాగ‌ర‌త్న‌మ్మ‌ బయోపిక్ లో అనుష్క ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త్వ‌ర‌లోనే ఓ బ‌యోపిక్‌లో నటించ‌నున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వినిపిస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర

మ‌హేశ్ 27 దాదాపు ఖ‌రారైన‌ట్టేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమా గురించి అభిమానులు అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది త‌న 26వ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’తో భారీ హిట్ అందుకున్న మ‌హేశ్ 27వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో

లెజండరీ దర్శకనిర్మాత విసు కన్నుమూత

కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు, రచయిత, స్టేజ్ ఆర్టిస్ట్‌, నిర్మాత, ద‌ర్శకుడు విసు ఇవాళ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..

ఏపీలోనూ మార్చి 31 వరకు లాక్‌డౌన్

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కీలక ప్రకటన చేశారు.

కేసీఆర్ కీలక నిర్ణయం.. మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్

కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న తరుణంలో.. వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని