మ‌రోసారి పాయ‌ల్‌తో స్పెష‌ల్‌..?

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

'RX 100' చిత్రంతో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టి హాట్ బ్యూటీగానే కాదు.. మంచి పెర్ఫామ‌ర్‌గా పేరు సంపాదించుకుంది పాయ‌ల్ రాజ్‌పుత్ దాంతో వెంకీమామ‌లో వెంక‌టేశ్ స‌ర‌స‌న‌, డిస్కోరాజాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. వీటితో పాటు 'RDX ల‌వ్‌' సినిమాలో న‌టిస్తుంది.

ఈ సినిమాలో తేజ‌స్ కంచ‌ర్ల హీరోగా న‌టిస్తున్నా కూడా మెయిన్ క‌థాంశం అంతా పాయ‌ల్ రాజ్‌పుత్ చుట్టూనే తిరుగుతుంది. వీటితో పాటు తాజాగా ఈమె తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నుంది. అయితే హీరో్యిన్‌గా కాదు.. స్పెష‌ల్ సాంగ్‌. త్వ‌ర‌లోనే తేజ డైరెక్ట్ చేయ‌బోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో పాయ‌ల్‌ను స్పెష‌ల్ సాంగ్‌లో న‌టింప చేయ‌డానికి తేజ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్‌. ఇది వ‌ర‌కు తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'సీత‌' చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఇప్పుడు తేజ మ‌రోసారి కూడా అలాంటి హాట్ స్పెష‌ల్ సాంగ్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్‌ను న‌టింప చేయ‌బోతున్నాడ‌ట‌.

పాయ‌ల్ న‌టిస్తోన్న 'RDX ల‌వ్‌'లో టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ రెండింటిలో రొమాన్స్‌, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో పాయిల్ రెచ్చిపోనుంది. టీజ‌ర్‌లో రొమాన్స్ ఉంటే.. ట్రైల‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్,యాక్ష‌న్ పార్ట్ ఉంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.