క్రియేటివిటీని పీక్స్‌లో చూపిస్తున్న పాయ‌ల్‌

  • IndiaGlitz, [Thursday,April 23 2020]

హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన క్వారంటైన్ టైమ్‌ను డిఫ‌రెంట్‌గా వాడుకుంటుంది. ఇంటిప‌నులు చేసుకుంటున్నాన‌ని, త‌న ప‌ని మ‌నిషిని మిస్ అవుతున్నాన‌ని, బోర్‌గా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వీడియోలు పెడుతున్న పాయ‌ల్ రీసెంట్‌గా ఆంగ్ల ప‌త్రిక‌ల్లో వ‌చ్చే పేజ్ 3 న్యూస్ పేప‌ర్‌నే త‌న డ్రెస్‌గా క‌వ‌ర్ చేసుకుని(పేప‌ర్ స్క‌ర్ట్‌) ఫొటోల‌ను దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసింది. ఇటీవ‌ల పిల్లో ఛాలెంజ్ విసిరింది. అంటే త‌ల‌గ‌డ‌ల‌ను డ్రెస్సులాగా క‌ప్పుకుని ఫొటోల‌ను షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పాయల్ పేప‌ర్ స్క‌ర్ట్ చూసిన వారికి ఆహా నా పెళ్లంటే కోట‌శ్రీనివాస‌రావు చేసిన కామెడీ గుర్తుకు రాక‌మాన‌దు. పాయ‌ల్‌కు ఇంత క్రియేటివిటీ ఏంటి బాబోయ్ అని అనుకోవ‌డం ప్రేక్ష‌కుడి వంత‌వుతుంది.

తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో హాట్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. అయితే ఆ త‌ర్వాత ఆమె న‌టించిన ఆర్.డి.ఎక్స్ ల‌వ్ ఆమెను పాతాళంలోకి తోసేసింది. అలాగే వెంకీమామ హిట్టే అయినా త‌న‌ను బాబి స‌రిగ్గా ఎష్టాబ్లిష్ చేయ‌లేద‌ని ఈ భామ వాపోతుంది. ఇక డిస్కోరాజాలో ర‌వితేజ ప‌క్క‌న మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన‌ప్ప‌టికీ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో పాయ‌ల్‌కు అవ‌కాశాలు లేకుండా పోయాయి.

More News

కిమ్.. మీరు బాగుండాలి.. : ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తి దృష్ట్యా అమర్ నాథ్ యాత్ర రద్దు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు.. ప్రాణాలు పోతున్నాయ్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున వాడుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో

ప్రభాస్‌తో పెళ్లిపై పెదవి విప్పిన నిహారిక..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మెగా వారసురాలు నిహారిక కొణిదెల పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో.. మీడియాలో వార్తలు వచ్చిన విషయం

మ‌ల‌యాళం నేర్చుకుంటున్న యంగ్ టైగ‌ర్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్