పోలీస్ పాత్రలో పాయల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `ఆర్.ఎక్స్ 100`లో లిప్ లాక్స్‌తో పాటు నెగిటివ్ టచ్ ఉన్న లేడీ విలన్‌గా నటించి నటిగా ఆకట్టుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ సక్సెస్‌తో పాయల్‌కు చాలా మంచి పేరొచ్చింది. అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అయితే పాయల్ అచితూచి అవకాశాలను ఎంచుకుంటుంది. అది కూడా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది. తమిళ చిత్రంలో నటిస్తోన్న పాయల్ రెండు చిత్రాల్లో నటించనుంది.
అందులో ఒకటి భానుశంకర్ దర్శకత్వంలో స్పోర్ట్స్ మూవీ చేస్తుంది. అలాగే ప్రదీప్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఉమెన్ సెంట్రిక్ మూవీలో పాయల్ నటించనుంది. అది కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో. ఈ పాత్ర కోసం పాయల్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం తయారవుతూనే, పోలీస్ ఆఫీసర్స్ పై రూపొందిన చిత్రాలను చూస్తుందట. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పాయల్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తెరపై చూడొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.