సొంత మినీ యాప్‌ స్టోర్‌ను ప్రారంభించిన పేటీఎం..

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు తొలగించిన యాప్.. అది జరిగిన కొద్ది రోజులకే సొంతంగా యాప్ స్టోర్‌ను ప్రారంభించి అందరి దృష్టినీ ఆకష్టించింది. అది కూడా అతి తక్కువ ఖర్చుతో ప్రారంభించడం విశేషం. అది మనందరికీ తెలిసిన పేటీఎం సంస్థే. ఈ పేటీఎం సంస్థ ఇండియన్ యాప్ డెవలపర్స్ కోసం ప్రత్యేక యాండ్రాయిడ్ మినీ స్టోర్‌ను ప్రారంభించి.. గూగుల్‌కు డైరెక్టుగా సవాల్ విసిరింది. దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ మినీ యాప్ స్టోర్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండానే వినియోగించవచ్చు.

మొబైల్ వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఈ యాప్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని పేటీఎం సంస్థ కల్పించింది. దీని కారణంగా యూజర్ల డేటా ప్రైవసీకి ముప్పు ఉండదని పేటీఎం తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెప్టెంబర్ 18న డెవలపర్ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించిందన్న కారణంగా కొన్ని గంటల పాటు పేటీఎంను తొలగించారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే తక్కువ ఖర్చుతో పేటీఎం సొంతంగా యాప్ స్టోర్‌ను ప్రారంభించడం విశేషం. అంతే కాకుండా జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్‌కి కూడా తమ ప్లే స్టోర్‌లో పేటీఎం అవకాశం కల్పించనుంది. 300 సంస్థలు తమ ప్లే స్టోర్ కోసం యాప్స్‌ను డెవలప్ చేశాయని పేటీఎం తెలిపింది. ఈ సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌శేఖర్‌శర్మ మాట్లాడుతూ.. మన దేశానికి చెందిన యాప్ డెవలపర్స్‌కి అవకాశం కల్పించడంలో భాగంగానే యాప్ స్టోర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. అంతేకాకుండా ఫ్యూచర్‌లో కూడా ఇండియన్ యాప్ డెవలపర్స్‌కు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని కూడా వెల్లడించారు.

పేటీఎం మినీ యాప్‌ స్టోర్‌లో యాప్స్‌ లిస్ట్‌ చేసిన డెవలపర్లు పేటీఎం వాలెట్, పేమెంట్స్ బ్యాంకింగ్‌, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు సేవలను తమ యాప్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చని వెల్లడించింది. పేటీఎంను తొలగించడం ట్రిగ్గర్ అయితే.. పేటీఎం మాత్రం గూగుల్ ప్రత్యక్ష పతనాన్ని కాంక్షించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం, స్టార్టప్ వ్యవస్థాపకులు పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, రేజర్పే హర్షిల్ మాథుర్, మరో 50 మంది వ్యవస్థాపకులతో కలిసి గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా ఇండియన్ యాప్ స్టోర్‌ను నిర్మించడంలో సాధ్యాసాధ్యాలను గురించి చర్చించారు. అప్పుడే ఈ మినీ యాప్ స్టోర్‌ను డెవలప్ చేసేందుకు అడుగులు పడినట్టు తెలుస్తోంది.

More News

‘సోలో లైఫే సో బెటర్’ అంటూనే గుడ్ బై చెప్పబోతున్నాడుగా..

మెగా హీరో సాయి తేజ్ అప్ కమింగ్ మూవీ ‘సోలో లైఫే సో బెటర్’. అయితే సాయి తేజ్ సోలో లైఫే సో బెటర్ అంటూనే సోలో లైఫ్‌కి గుడ్ బై చెప్పబోతున్నాడు.

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు గగనమేనా..?

దుబ్బాక అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఇప్పుడిప్పుడే తెరపడుతోంది. తాజాగా టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నామినేషన్ పర్వం.. మంటలు తెప్పించారు..

ఇవాళంతా నామినేషన్ పర్వం నడిచింది. అమ్మో చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఈ రేంజ్ హీట్ కనిపించదేమో అనిపించింది.

కాజల్‌ పెళ్లి చేసుకోబోయే బిజినెస్‌మేన్‌ ఎవరంటే?

దక్షిణాదిలో తెలుగు, తమిళ సినిమాలు సహా బాలీవుడ్‌లోనూ నటించిన హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది కాజల్‌ అగర్వాల్‌.

సరికొత్త పాత్రలో మాస్‌రాజా రవితేజ...!

మాస్‌ మహారాజాఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘క్రాక్’ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌ సినిమాలో నటించాల్సి ఉంది.