పెద్దిరెడ్డి కుటుంబం ఓ మాఫియా: వర్ల రామయ్య


Send us your feedback to audioarticles@vaarta.com


పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారై.. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. పెద్దిరెడ్డి ఆటవీ భూముల ఆక్రమణపై కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, వర్ల రామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గతంలో తన అక్రమ సంపాదనతో జగన్ ను పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి అనేక సార్లు ప్రయత్నించారని ఆరోపించారు రామయ్య. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని...గనులు, ఖనిజం, ఇసుక, ప్రభుత్వ స్థలాలు, పేదల, అటవీ భూములు, ఎర్రచందనం, యదేచ్ఛగా దోచుకున్నారని.. ఎవరైనా ప్రశ్నిస్తే సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి నోరు మూయించేవారని ఆరోపించారు.
238 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించారని, బీహార్ రాజకీయం కూడా పెద్దిరెడ్డి రాజకీయం ముందు దిగదుడుపే అన్నారు. గనుల శాఖలో 400 మందికి ప్రైవేటుగా ఉద్యోగాలిచ్చారట పెద్దిరెడ్డి. ఆయన పాపాల్లో జగన్ కు భాగముండబట్టే ఇతని అవినీతి సామ్రాజ్యాన్ని జగన్ ఏనాడూ ప్రశ్నించలేదని ఆరోపించారు.
గనుల శాఖను పెద్దిరెడ్డి చూస్తూ.. అటవీశాఖ పెద్దిరెడ్డి శ్రీమతికి, మద్యం అవినాష్ రెడ్డికి, ఎర్రచందనం పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాధరెడ్డికి ఇచ్చి.. అంతా కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టారని వర్ల రామయ్య ఆరోపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments