'పిహిల్వాన్' ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

శాండిల్ వుడ్ బాద్షా..'ఈగ' ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'ప‌హిల్వాన్‌'. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ 'ప‌హిల్వాన్‌' అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన 'ప‌హిల్వాన్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.

అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 'కె.జి.య‌ఫ్‌' చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు 'ప‌హిల్వాన్‌' చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

శివ కంఠమనేని హీరో గా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా

‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఏపీ హైకోర్టులో జగన్‌ సర్కార్‌కు ఊహించని షాక్

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన ‘పోలవరం’ రివర్స్ టెండరింగ్‌ వేసి తీరుతామని జగన్ సర్కార్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

తెలుగువాడైన కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి ఆగిపోనుందా? అంటే అవునని గుస‌గుస‌లు వినిపించాయి.

గోడ దూకి మరీ చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరంను నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

'నమ్మేలా లేదే' అంటున్న 'రాజావారు రాణిగారు'

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు 'రాజావారు రాణిగారు'.పోస్టర్లతో టీజర్ తో జనాలలో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గతవారమే మొదటి పాట ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.