50 రోజులుతో యు.ఎస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన పెళ్లిచూపులు..!

  • IndiaGlitz, [Friday,September 16 2016]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతు వ‌ర్మ జంట‌గా త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లిచూపులు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి నిర్మించారు. చిన్న చిత్రంగా రిలీజైన పెళ్లిచూపులు ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ తో పాటు యు.ఎస్ లో కూడా విజ‌య‌వంతంగా పెళ్లిచూపులు 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం విశేషం. కొత్త‌క‌థ‌ల‌తో రూపొందే చిన్న చిత్రాల‌కు పెళ్లిచూపులు ఊపిరినిచ్చింది. యు.ఎస్ లో 10 సెంట‌ర్స్ లో పెళ్లిచూపులు చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇలా యు.ఎస్ లో 10 సెంట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు చిత్రంగా పెళ్లిచూపులు స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి స్పందిస్తూ.... పెళ్లిచూపులు చిత్రం ఇంత‌టి విజ‌యాన్ని సాధించి 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం ఒక అద్భుత‌మైన రోజు ఇది. ఈ చిత్రంలో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతువ‌ర్మ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే ఈ చిన్ని చిత్రాన్ని ఎంతో మందికి రీచ్ అయ్యేలా ఎంత‌గానో స‌హ‌క‌రించిన క్రిటిక్స్, సురేష్ బాబు, సురేష్ ప్రొడ‌క్ష‌న్ టీమ్ & మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి & టీమ్ అంద‌రికీ థ్యాంక్స్. నిర్మాత‌గా నా 10 ఏళ్ల ప్ర‌యాణంలో పెళ్లిచూపులు విజ‌యం మ‌రెన్ని మంచి సినిమాలు తీసేలా బాధ్య‌త‌ను పెంచింది అన్నారు.

More News

జ‌న‌తా గ్యారేజ్ పై కోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, క‌మెడియ‌న్ గా...ఇలా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్ధానాన్ని ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు. తెలుగు సినిమాల్లో ప‌ర‌భాషా న‌టులు ఎక్కువైపోతున్నారు అంటూ గ‌త కొన్నేళ్లుగా కోట ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

న‌య‌న‌తార రోల్ గురించి క్లారిటి ఇచ్చిన మురుగుదాస్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రం దాదాపు 100 కోట్ల‌తో రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రేపే వెంకీ గురు ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సుధా కొంగ‌ర తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు.

4 ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈడు గోల్డ్ ఎహే ఆడియో రిలీజ్..!

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా  చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎ టివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ద‌స‌రా రేసులో జాగ్వార్

మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ ని  హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందిస్తున్నభారీ  చిత్రం జాగ్వార్. ఈ చిత్రాన్ని చెన్నాంబిక ఫిలింస్ బ్యాన‌ర్ పై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు.