జూన్ 9న విడుదలకానున్న 'పెళ్ళికి ముందు ప్రేమకథ'

  • IndiaGlitz, [Friday,May 26 2017]

చేతన్‌ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మధు గోపు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'పెళ్ళికి ముందు ప్రేమకథ'. డి.ఎస్‌.కె, అవినాష్‌ సలండ్ర, సుధాకర్‌ పట్నం నిర్మాతలు. ప్రేమ్‌ కుమార్‌ పాట్ర, మాస్టర్‌ అవినాష్‌ సలండ్‌ సమర్పణలో గణపతి ఎంటర్‌టైన్మెంట్స్‌, పట్నం ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రూపొందుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకత్వ పర్యవేక్షకుడు డి.ఎస్‌.రావు మాట్లాడుతూ.. 'చెప్పిన కథ నచ్చింది. అయితే సినిమాను తీయగలుగుతామా? అని ఆలోచిస్తున్న సమయంలో సుధాకర్‌ నన్ను కలిశాడు. అలా నలుగురుగా కలిసి నా దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, ఛాలెంజింగ్‌ తీసుకుని చేశాను. రొమాన్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకుని తీశాము. అవసరాల శ్రీనివాస్ మా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. విడుదల చేసిన ట్రైలర్-ఆడియోకి మంచి స్పందన లభించింది. సినిమాకి కూడా అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు!

More News

'అందగాడు' సెన్సార్ పూర్తి

యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

కళ్యాణ్ రామ్ చిత్రానికి తమిళ రచయితలు...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో

రజనీ చిత్రంలో జాతీయ నటి

హ్యుమన్ ట్రాఫికింగ్ అనే అంశంపై రూపొందిన చిత్రం 'నా బంగారు తల్లి'.

నాన్న సినిమా చూసి చాలా హ్యాపీ - నాగచైతన్య

యువసామ్రాట్ నాగచైతన్య, గ్లామర్ స్టార్ రకుల్ప్రీత్సింగ్ కాంబినేషన్లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'.

'జయదేవ్' చిత్రంలోని నాలుగో పాటని రిలీజ్ చేసిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్'.